»   » ‘ధోనీ’ మీద వంద సినిమాలు చేసినా సరిపోవు (ఫోటోస్)

‘ధోనీ’ మీద వంద సినిమాలు చేసినా సరిపోవు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని జీవిత కథతో బాలీవుడ్ దర్శకుడు నీరజ్‌ పాండే ఓ చిత్రాన్ని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరో. 'ఎంఎస్ ధోని-ది అన్ టోల్డ్ స్టోరీ' అనేది టైటిల్. టి-20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ లో ధోనీ చేసిన అద్భుతమైన స్టంప్ ఔట్లు టీమిండియా గెలిపించాయి.

మ్యాచ్ ముగిసిన అనంతరం బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ధోనీని వెళ్లి కలిసాడు. అతడితో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసాడు. ధోనీ జీవితంపై వంద సినిమాలు చేసినా తక్కువే. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్లలో ధోనీ ఒకరు, గొప్ప క్రికెటర్ అంటూ సుశాంత్ సింగ్ ట్వీట్ చేసాడు.

Also See: ఎం.ఎస్‌. ధోని పై సినిమా..టీజర్ ఇదిగో (వీడియో)

'ధోనీ' చిత్రంలో సుశాంత్ సింగ్ ధోనీ తొలినాళ్లలో లుక్ తలపించేలా జులపాల జుట్టుతో కనిపించబోతున్నాడు. ధోని మాధిరిగా హెలికాప్టర్ షాట్లు కొడుతూ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ 7వ నెంబర్ గల టీమిండియా జెర్సీ ధరించి కనిపించనున్నాడు. 7 నెంబర్ అనేది ధోనీకి చాలా స్పెషల్. ఎందుకంటే ధోనీ పుట్టిన రోజు 7/7/1981.

స్లైడ్ షోలో మరిన్ని వివరాలు, ఫోటోస్

ధోని గురించి సుశాంత్ ట్వీట్

ధోని గురించి సుశాంత్ ట్వీట్

ధోనీ జీవితంపై వంద సినిమాలు చేసినా తక్కువే. ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్లలో ధోనీ ఒకరు, గొప్ప క్రికెటర్ అంటూ సుశాంత్ సింగ్ ట్వీట్ చేసాడు.

రియల్ లైఫ్ క్యారెక్టర్లు కూడా

రియల్ లైఫ్ క్యారెక్టర్లు కూడా

రియల్ లైఫ్ లో క్రికెటర్ ధోనీ, సురేష్ రైనా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. సినిమాలో కూడా దర్శకుడు రైనా పాత్రను కూడా చూపించబోతున్నాడు. రైనా పాత్రలో టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపించబోతున్నాడు.

సాక్షి సింగ్

సాక్షి సింగ్

ఇక ధోనీ భార్య సాక్షి సింగ్ పాత్రలో కైరా అద్వానీ కనిపంచబోతోంది. విరాట్ కోహ్లి పాత్రలో ఫవాద్ ఖాన్ కనిపిస్తారు. ఈ సినిమాలో జాన్ అబ్రహం, భూమిక, కాదర్ ఖాన్, వరుణ్ ధావన్, అర్జున్ కపూర్ తదితరులు కూడా ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తారు.

మంచి ఫలితాలు

మంచి ఫలితాలు

ఇటు సినీ ప్రియులతో పాటు, అటు క్రికెట్ అభిమానులు కూడా ఈ చిత్రంపై ఆసక్తి చూపుతారు కాబట్టి మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు.

English summary
"We can make 100films on U& it'll still not be enough.U r 1of the best sports mind ever & a GREAT person.We love u MS" Sushant S Rajput tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu