»   » శేఖర్‌ కపూర్‌ 'పానీ' హీరో మారాడు

శేఖర్‌ కపూర్‌ 'పానీ' హీరో మారాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shekhar Kapur
ముంబై: యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ సంస్థ శేఖర్‌ కపూర్‌ దర్శకత్వంలో 'పానీ' అనే సినిమాను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో హృతిక్‌ రోషన్‌ని హీరోగా ఎంపిక చేసుకొన్నారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని యంగ్ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ దక్కించుకొన్నట్లు తెలిసింది. 'శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌' తరవాత యశ్‌రాజ్‌ సంస్థలో సుశాంత్‌ నటించబోతున్న రెండో సినిమా ఇది.

దర్శకుడు శేఖర్‌ కపూర్‌ మాట్లాడుతూ... ''సుశాంత్‌ గత చిత్రాల్లోని నటన నన్ను ఆకట్టుకొంది. యువ హీరోల్లో మంచి భవిష్యత్తు ఉన్న హీరో అతను. 'పానీ' కథకు సుశాంత్‌ న్యాయం చేయగలడు. అందుకే అతన్ని ఎంపిక చేసుకున్నాము''అని తెలిపారు. ఇక శేఖర్ కపూర్ ఈ చిత్రం కోసం తొలుత వివేక్‌ ఒబెరాయ్‌, రణ్‌బీర్‌ కపూర్‌లతో చర్చించినట్లు తెలిసింది.

'పానీ'ని యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌పై ఆదిత్య చోప్రా దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభమవుతుంది. వచ్చే ఏడాది మధ్యలో ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ప్రపంచంలో ఇప్పటిదాకా ఆధిపత్యం కోసం పలు దేశాలు యుద్ధం చేశాయి. రాబోయేకాలంలో నీటి కోసం ఒక దేశం మీద మరో దేశం యుద్ధం చేసే పరిస్థితి వస్తుందని ఈ చిత్రంలో చెప్పబోతున్నారు.

ఈ విషయమై శేఖర్ కపూర్ ట్వీట్ చేస్తూ... "నేను పదిహేను సంవత్సరాల క్రితం పానీ కథ రాస్తున్నప్పుడు ఇంత పెద్ద ది అవుతుందని ఊహించలేదు.రిచర్డ్ అటెన్ బరో తాను గాంధీ చిత్రం చేయటానికి ఇరవై సంవత్సరాలు పట్టింటదని చెప్పారు. ప్రతీ దర్శకుడు కు ఇలాంటిది ఎదురౌతుందనుకుంటా," అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఏకంగా ఓ నగరాన్నే నిర్మిస్తున్నారు. ఇందులో సగభాగంలో మాత్రమే నీరు ఉంటుందని... మిగతా సగం నగరంలో నీళ్లు ఉండవని అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో 'పానీ'లో చూడొచ్చని శేఖర్ అంటున్నారు.

'పానీ' కథ - భవిష్యత్తులో నీటి కోసం జరిగే యుద్ధాల చుట్టూ తిరుగుతుందని తెలిసింది. అయితే సున్నితమైన ప్రేమ కథ కూడా అంతర్లీనంగా కొనసాగుతుందని తెలిసింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందించబోతున్నారు. శేఖర్ కపూర్ చిత్రాలు మాసూమ్, బాండిట్ క్వీన్, మిస్టర్ ఇండియా, క్వీన్ ఎలిజిబుత్ వంటివి సినీ చరిత్రలో నిలిచిపోయాయి.

English summary

 Sushant Singh Rajput is turning out to be one of the most "inspiring" young actors in the country, said Shekhar Kapur, director of the upcoming film 'Paani', which will have an ensemble cast of Indian and Western stars. "It's going to be an exciting director-actor collaboration with him on 'Paani'," Kapur said, adding that Sushant will be joined by a young leading actress from the West. 'Paani' is set in the world of the future where wars over water have broken out. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu