అమ్మా ఎందుకు విడిచి వెళ్లావు.. తల్లికి సినీ హీరో లేఖ
చిన్నతనంలో దూరమైన తన తల్లికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లేఖ రాసి తన హృదయంలో బాధను చెప్పుకొన్నాడు.
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తాజాగా తన తల్లికి రాసిన లేఖ గుండెల్ని పిండివేస్తున్నది. అయితే సుశాంత్ రాసింది బతికి ఉన్న తన తల్లికి అనుకుంటే పొరపాటుపడినట్టే. చిన్నతనంలో తనకు దూరమై దివంగతాలకు చేరుకొన్న తన తల్లికి ఉత్తరం రాసి తన హృదయంలో బాధను చెప్పుకొన్నాడు. 'అమ్మా.. ఎల్లకాలం నా తోడు ఉంటాను అని మాటిచ్చావు.

అలాగే నేను కూడా ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను అని నీకు మాటిచ్చాను. మనిద్దరం కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయాం' అని లేఖలో సుశాంత్ పేర్కొన్నాడు. ప్రస్తుతం నీ ఙ్ఞాపకాలతోనే జీవిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరి చిత్రంతో హిట్‌ను సొంతం చేసుకొన్న సుశాంత్ టీనేజ్‌లో ఉండగా ఆయన తల్లి మరణించింది. అప్పటి నుంచి ఇంకా తల్లి ఙ్ఞాపకాలతోనే జీవితం గడుపుతున్నాడు. తాజాగా సుశాంత్ రాసిన లేఖ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
sushant singh rajput ms dhoni the untold story bollywood heartfelt letter సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎంఎస్ ధోని ది అన్‌టోల్డ్ స్టోరి బాలీవుడ్ లేఖ


Click it and Unblock the Notifications