»   » ‘అత్తారింటికి దారేది’ చిత్ర నిర్మాతతో సుశాంత్ చిత్రం

‘అత్తారింటికి దారేది’ చిత్ర నిర్మాతతో సుశాంత్ చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కాళిదాసు, కరెంట్, అడ్డా చిత్రాల్లో నటించిన యువ హీరో సుశాంత్ బర్త్ డే మార్చి 18. ఈ సందర్భంగా సుశాంత్ నటించే కొత్త చిత్రం వివరాలు ప్రకటించారు. సుశాంత్ కథానాయకుడుగా జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అందించిన శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర అధినేత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ఈ చిత్రం గురించి హీరో సుశాంత్ మాట్లాడుతూ...'నా బర్త్ డేకి ఈ న్యూస్ ఓ స్పెల్ గిఫ్టుగా భావిస్తున్నాను. ఇంత వరకు శ్రీనాగ్ కార్పొరేషన్ బేనర్లోనే సినిమాలు చేసిన నేను బయటి బేనర్లో చెయ్యాలంటే ఓ పెద్ద బేనర్లో చేయాలని వెయిట్ చేసాను. నేను వెయిట్ చేసినట్లుగానే అత్తారింటికి దారేది వంటి బిగ్గెస్ట్ హిట్ తీసిన బివిఎస్ఎన్ ప్రసాద్ గారి బేనర్లో నటించే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్, జి నాగేశ్వరరెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నా కెరీర్‌కి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది అన్నారు.

దర్శకుడు జి.నాగేశ్వరరావు మాట్లాడుతూ...'ఇది ఒక యూత్ ఫుల్ మాస్ ఎంటర్టనర్. సుశాంత్ ఇప్పటి వరకు లవ్ సినిమాలు చేసాడు. ఫస్ట్ టైం సుశాంత్‌తో ఉన్న ఆల్ యాంగిల్స్‌‍ని ప్రజెంట్ చెయ్యడానికి ప్లాన్ చేసిన సబ్జెక్ట్ ఇది. బివిఎస్ఎన్ ప్రసాద్ గారి బేనర్లో చెయ్యడం చాలా హ్యాపీగా ఉంది అన్నారు.

నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ...'అత్తారింటికి దారేది తర్వాత మా బేనర్లో చేస్తున్న సినిమా ఇది. నాగేశ్వరరెడ్డితో సినిమా చేద్దామని చాలా కాలంగా అనుకుంటున్నాం. ఆయన చెప్పిన కథ సుశాంత్ కి పర్ ఫెక్టుగా ఉంటుందనిపించింది. త్వరలో సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాం. ఏప్రిల్ నెలలో నిర్మాణ కార్యక్రమాలు

English summary
మొదలవుతాయి అన్నారు.
 
 Sushanth has got the first biggie of his career. We say biggie because this film will be produced by the producer of last year's blockbuster film, Pawan Kalyan starrer Attarintiki Daaredi.
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu