»   » సుశాంత్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ (వీడియో)

సుశాంత్ తాజా చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'సిసింద్రీ' సినిమాలో ఆటాడుకుందాం రా... అందగాడా అంటూ సాగే ఓ పాట ఉంది. ఇప్పుడు ఆ పల్లవినే తన సినిమాకి పేరుగా మార్చుకొని వచ్చాడు సుశాంత్‌. జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం చేస్తున్నాడు సుశాంత్‌. దానికి 'ఆటాడుకుందాం రా...' అనే పేరును ఖరారు చేసి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని వదిలారు.

Sushanth's Aatadukundam Raa Telugu Movie First Look

చింతలపూడి శ్రీనివాస్, నాగ సుశీల నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని విడుదల చేసారు. ఆ వీడియోని ఫేస్ బుక్ ద్వారా సుశాంత్ షేర్ చేసారు. ఈ ఫస్ట్ లుక్ ని అఖిల్ లాంచ్ చేసారు.

The wait is over and here's the first look of my upcoming movie #AatadukundamRaa!Do watch,share your views :)http://bit.ly/AatadukundamRaaFirstLook

Posted by Sushanth on 5 November 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'అడ్డా'తో ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న సుశాంత్‌ ఈ కొత్త చిత్రంతో హిట్ కొడతాననే ధీమాతో ఉన్నారు. 'దేనికైనారెడీ' వంటి చిత్రాన్ని రూపొందించిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోండటంతో మంచి క్రేజ్ వస్తోంది.

సుశాంత్‌ మాట్లాడుతూ '' నాగేశ్వరరెడ్డి చెప్పిన కథ బాగుంది. నా కెరీర్‌కి లాభం చేకూర్చే చిత్రమిది ''అన్నారు. జి. నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ''ఇది యువత నేపథ్యంలో సాగే వినోదాత్మక చిత్రం. సుశాంత్‌ నటనలోని అన్ని కోణాల్ని చూపించేలా ఉంటుంది''అన్నారు.

Sushanth's Aatadukundam Raa Telugu Movie First Look

నిర్మాతలు మాట్లాడుతూ ''ఈ మధ్య కాలంలో అక్కినేని కథానాయకుల చిత్రాలన్నీ విజయబావుటా ఎగరేస్తున్నాయి. ఆ జాబితాలో ఈ చిత్రమూ చేరుతుంది. 'అడ్డా తరవాత మంచి కథ కోసమే ఇంతకాలం ఎదురుచూశాం. ఇప్పుడు అలాంటి కథను శ్రీధర్‌ సీపాన అందించారు. ''అన్నారు. బ్రహ్మానందం, నాగినీడు, రఘుబాబు, తనికెళ్ల భరణి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు.

English summary
Aatadukundam Raa Telugu Movie first look motion poster, featuring Sushanth, Sonam, Brahmanandam and Vennala Kishore among others.
Please Wait while comments are loading...