»   » నాన్న పేరు చెడగొడతామేమో.. అప్పుడే సావిత్రి గారి ఇల్లు చూశాం!

నాన్న పేరు చెడగొడతామేమో.. అప్పుడే సావిత్రి గారి ఇల్లు చూశాం!

Subscribe to Filmibeat Telugu

లెజెండరీ నటి సావిత్రి జీవిత చరిత్ర మహానటి చిత్రంగా తెరకెక్కించారు. అశ్విని దత్ ఈ చిత్రాన్ని వెనుక ఉండి నడిపించగా ఆయన కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించారు. ఇటీవల అల్లు అరవింద్ మహా నటి చిత్ర యూనిట్ కు ఘనమైన పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో స్వప్న దత్ మాట్లాడారు.

వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ అనేక బ్లాక్ బస్టర్ చిత్రాలని నిర్మించిన సంగతి తెలిసిందే. మహానటి చిత్రాన్ని నిర్మించాలని అనుకున్నప్పుడు.. నాన్నగారి పేరు ఎందుకు చెడగొడతారు అని అన్న వారుకూడా ఉన్నారని స్వప్న దత్ నవ్వుతూ అన్నారు. చివరకు మహానటి చిత్రంతో నాన్నకు మంచి గిఫ్ట్ అందించామని స్వప్న తెలిపారు.

Swapna Dutt Speech at Mahanati Success Celebrations

చెన్నైకి తాను, ప్రియాంక, నాగ అశ్విన్ కలసి వెళ్లిన సమయంలో తొలిసారి సావిత్రి గారి ఇల్లు చూశామని అప్పటి నుంచే ఆమె గురించి అనేక ఊహలు మొదలయ్యాయని స్వప్న అన్నారు. మహానటి చిత్రం మంచి వసూళ్లతో ప్రస్తుతం విజయవంతంగా రన్ అవుతోంది.

English summary
Swapna Dutt Speech at Mahanati Success Celebrations. Swapna Dutt is one of the producers of Mahanati
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X