»   » స్వాతి హ్యాట్రిక్ సాధించడం ఖాయం

స్వాతి హ్యాట్రిక్ సాధించడం ఖాయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వాతి టైటిల్ రోల్ లో రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'. తెలుగు, తమిళ ('తిరుపర సుందరి') భాషల్లో ఏకకాలంలో జె.రామాంజనేయులు సమర్పణలో క్రేజీ మీడియా పతాకంపై ఎ. చినబాబు, ఎం. రాజశేఖర్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'గీతాంజలి' ఫేం రాజ కిరణ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయ్యింది. త్వరలో పాటల చిత్రీకరణ ఆరంభం కానుంది. ఈపాటలను బెంగళూరులోని హంపీ, బదామీలో చిత్రీకరించనున్నారు.

ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ - "ప్లాన్ చేసిన ప్రకారమే షూటింగ్ జరుగుతోంది. ఇటీవల డబ్బింగ్ కార్యక్రమాలు మొదలు పెట్టాం. అవి కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. అవుట్ పుట్ సంతృప్తికరంగా ఉంది. ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఆద్యంతం ఉత్కంఠగా సాగే ఈ చిత్రంలో స్వాతి నటన హైలైట్ గా నిలుస్తుంది'' అని చెప్పారు.


 Swathi's Tripura is 2 songs away

దర్శకుడు మాట్లాడుతూ - ''పూర్తయినంతవరకు రషెస్ చూశాం. చాలా బాగా వచ్చింది. స్వామి రారా, కార్తికేయ విజయాల తర్వాత స్వాతి చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంతో స్వాతి హ్యాట్రిక్ సాధించడం ఖాయం. సినిమా అంత బాగా వచ్చింది. 'గీతాంజలి'కన్నా అద్భుతంగా వచ్చింది. సప్తగిరి చేసిన కామెడీ హైలైట్ గా నిలుస్తుంది. ఇందులో ఆయనది ఫల్ లెంగ్త్ రోల్. ఆ పాత్రకు సంబంధించిన చిత్రీకరణకు 25 రోజులు పట్టింది. పిల్లలు, పెద్దలు అందరూ చూడదగ్గ ఎంటర్ టైనర్ ఇది'' అని చెప్పారు.


ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే : కోనవెంకట్, శ్రీనివాస్ వెలిగొండ, మాటలు: రాజా, సినిమాటోగ్రఫీ: రవికుమార్ సానా, ఎడిటింగ్: ఉపేంద్ర, పాటలు: చంద్రబోస్, రామజోగయ్యశాస్త్రి, నిర్మాతలు: ఎ.చినబాబు, ఎం. రాజశేఖర్, కథ-దర్శకత్వం: రాజకిరణ్, సమర్పణ: జె.రామాంజనేయులు

English summary
Raj Kiran directorial forthcoming film titled Tripura is heading to wrap up its shoot with its climax portion shoot by end of this month.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu