»   » శ్వేతాబసు ఐటం సాంగ్ హైలెట్ అంటున్నారు

శ్వేతాబసు ఐటం సాంగ్ హైలెట్ అంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'కొత్త బంగారు లోకం' చిత్రంతో పరిచయమైన శ్వేతాబసు గుర్తుండే ఉంటుంది. బాగా వళ్ళు చేసి వేషాలకు దూరమైన ఆమె ఇప్పుడు ఐటం సాంగ్ తో అలరించటానికి రెడీ అవుతోంది. ఓంకార్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'జీనియస్' చిత్రంలో ఆమె ఐటం సాంగ్ హైలెట్ అవుతుందంటున్నారు. హవీశ్ హీరోగా రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న 'జీనియస్' సినిమా పాటలు ఈ మధ్యన విడుదలయ్యాయి. ఓంకార్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఓక్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పిస్తోంది. జోష్వా శ్రీధర్ సంగీతం సమకూర్చగా, అనంతశ్రీరామ్ సాహిత్యం అందించారు.

చిత్రం గురించి ఓంకార్ మాట్లాడుతూ "ప్రతి విద్యార్థికి ఈ చిత్రం ఓ స్ఫూర్తి అవుతుంది. సిల్వర్ స్పూన్‌తో పెరిగిన హవీశ్ ఈ సినిమా కోసం చాలా శ్రమించాడు. జోష్వా శ్రీధర్ మ్యూజిక్ సూపర్‌గా ఇచ్చారు'' అన్నారు. ఈ చిత్ర కథారచయిత చిన్నికృష్ణ మాట్లాడుతూ "అన్నా హజారే స్ఫూర్తితో, ఆయన పుట్టిన ఊరికి వెళ్లి ఈ కథ రాశాను. విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకుని రాసిన కథ ఈ 'జీనియస్'. ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఓ వర్గం కలెక్షన్ల కోసం, మరో వర్గం రికార్డుల కోసం పోటీ పడుతున్నారు. వారిలో కొంచెం అయినా మార్పు రావాలని రాసిన కథ ఇది'' అని తెలిపారు.

నిర్మాత కిరణ్ మాట్లాడుతూ "హవీశ్ గొప్పగా నటించాడు. ఈ సినిమా కోసం ఓంకార్ చాలా కష్టపడ్డాడు. డబ్బుల కోసం ఈ సినిమా తియ్యలేదు. ఓ మంచి సందేశం ఉన్న కథ అని తీశాను. దీపావళి తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తాం'' అన్నారు. "పోస్టర్లలో కన్నీళ్లు ఉంటే క్లాస్ హీరో, కళ్లల్లో నిప్పులుంటే మాస్ హీరో. హవీశ్‌లో ఈ రెండూ ఉన్నాయి. వ్యక్తి పూజ వద్దని చెప్పే కథ'' అని పరుచూరి బ్రదర్స్ చెప్పారు. హీరో హవీశ్ మాట్లాడుతూ "ఇది చిన్నికృష్ణగారి డ్రీమ్ ప్రాజెక్ట్. శంకర్ రేంజ్‌లో ఓంకార్ ఈ సినిమా తీశారు. ఈ రోజు సమాజానికి కావాల్సిన సినిమా'' అన్నారు.

ఇక శ్వేతబాసు తాజాగా తారకరత్న హీరోగా వి. దొరస్వామిరాజు నిర్మిస్తున్న చిత్రం 'విజేత లో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో వరుడు చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా కూడా నటిస్తోంది. ఉదయ్‌భాస్కర్ దర్శకుడు. ఈ విషయమై నిర్మాత దొరస్వామి రాజు మాట్లాడుతూ...''నాగార్జున నటించిన 'కిరాయిదాదా'తో నిర్మాతగా నా ప్రస్థానం మొదలైంది. ఎందరో హీరోలతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాను. నందమూరి తారకరత్నతో ఇప్పుడు తీస్తున్న 'విజేత' నిజంగా అతన్ని విజేతగా నిలుపుతుంది'' అన్నారు.

English summary
Swetha Basu Prasad who shot to fame with Dil Raju's Kotta Bangaru Lokam didn’t get much needed success after that. So, the beautiful and bubbly actress is now testing her luck as an item girl. Swetha Basu has done an item song in the movie 'Genius' which stars Nuvvila fame Haveesh in the lead role. TV anchor Omkar is debuting as director with this message oriented movie. Movie is expected to release in November.
Please Wait while comments are loading...