»   » అది నేనుకాదు, సెక్స్ స్కాండల్‌పై శ్వేతా బసు స్పందన

అది నేనుకాదు, సెక్స్ స్కాండల్‌పై శ్వేతా బసు స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కుర్ర హీరోయిన్ శ్వేతా బసు వ్యబిచారం చేస్తోందంటూ...ఆ మధ్య ఓ టీవీ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్‌ నిర్వహించి బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె మూడు గంటలకు రూ. 3 లక్షల చొప్పున విటుల నుండి వసూలు చేస్తోందని, రాజకీయ నాయకులైతే రూ. 6 లక్షలు వసూలు చేస్తున్నట్లు సదరు ఛానల్ పేర్కొంది. బ్రోకర్లకు భారీగా కమీషన్ ఆఫర్ చేస్తూ ఈ చీకటి ఈ వ్యవహారం నడిపిస్తోందని వచ్చిన వార్త అప్పట్లో సంచలనం సృష్టించింది.

 Swetha Basu

దాదాపు రెండు నెలల క్రితం ఈ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి శ్వేతా బసు అసలు మీడియాకు కనిపించడమే మానేసింది. శ్వేతా బసు మీడియా ముందుకొచ్చి ఈ వార్తలను ఖండించక పోవడంతో అంతా నిజమే అనుకున్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ విషయం కూడా మర్చి పోయారంతా...!

అయితే ఇటీవల మీడియా కంట పడ్డ శ్వేతా బసుకు ఇవే ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే ఆ సెక్స్ స్కాండల్‌పై తనదైన రీతిలో స్పందించింది శ్వేతా బసు. ఆ వీడియాలో ఉంది నేను కాదని, తనకు అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని, నా సినిమా కెరీర్ సంతృప్తిగా సాగుతోందని చెప్పుకొచ్చింది శ్వేతా బసు.

మరి ఇంత కాలం ఈ విషయమై మీడియాలో చర్చ జరుగుతున్నా ఎందుకు స్పందించలేదనే ప్రశ్నకు శ్వేతా బసు స్పందిస్తూ....ఆ వీడియోలో ఉంది నేను కానపుడు స్పందించాల్సిన అవసరం లేదు. అందుకే ఇంత కాలం సైలెంటుగా ఉన్నాను. నా తప్పు లేనపుడు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటోంది శ్వేతా బసు.

English summary

 Swetha Basu has broken her silence on the alleged sex racket in Tollywood industry. Swetha has reacted sharply and condemned that it was not her who was shown in the video. She said it was not her in the video who use her body twofold.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu