»   » శ్వేతా బసు మళ్లీ వస్తోంది, ఇక బుల్లితెరపై...

శ్వేతా బసు మళ్లీ వస్తోంది, ఇక బుల్లితెరపై...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగులో కొత్త బంగారు లోకం సహా పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ శ్వేతా బసు గురించి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆమె వ్యబిచారం కేసులో ఇరుక్కోవడం, కొంత కాలం రెస్య్కూ హోంలో గడపడం, తాను తప్పు చేయలేదని కోర్టులో ప్రూవ్ కావడంతో బయటకు రావడం తెలిసిందే.

ఈ ఉదంతం తర్వాత హైదరాబాద్ నుండి మకాం ఉత్తేసిన శ్వేతా బసు... తన సొంతూరైన ముంబైలోనే ఉంటోంది. అక్కడే పలు సినిమా సంస్థల్లో పని చేస్తూ మళ్లీ కెరీర్లో ఎదిగే ప్రయత్నం చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ‘దార్ సబ్ కో లగ్ తా హై' అనే హారర్ సీరియల్ కు ఆమె సైన్ చేసినట్లు సమాచారం.

Swetha Basu Signs TV Horror Show

శ్వేతా బసు బాలనటిగా టీవీ సీరియల్స్ ద్వారానే కెరీర్ మొదలు పెట్టింది. హిందీలో పెద్ద హిట్టయిన టీవీ సీరియల్ ‘కహానీ ఘర్ ఘర్ కి'లో శ్వేతా బసు అప్పట్లో శృతి అనే పాత్ర పోషించింది. ఈ సీరియల్ లో శ్వేతా బసు నటనను చూసిన దర్శకుడు ‘మక్డీ' అనే చిత్రంలో అవకాశం ఇచ్చారు.

ఈ సినిమా తర్వాత శ్వేతా బసుకు తెలుగులో కొత్త బంగారు లోకంలో హీరోయిన్ గా అవకాశం రావడం, ఈ చిత్రం తర్వాత ఆమెకు తెలుగులో పలు చిత్రాల్లో నటించే ఛాన్స్ రావడం తెలిసిందే. అయితే కెరీర్లో హిట్లు లేక పోవడంతో అవకాశాలు తగ్గాయి. తర్వాత కొన్ని చిత్రాల్లో ఐటం సాంగులు కూడా చేసింది. తర్వాత వ్యభిచారం కేసులో ఇరుక్కోవడం, ఆ కేసు నుండి బయట పడటం తెలిసిందే.

English summary
Swetha was seen as a part of couple of Telugu TV game shows which generated good TRPs with her presence. After fourteen years, Swetha is once again doing a full-fledged assignment on TV in the form of a horror series titled as ‘Darr Sabko Lagta Hai.’
Please Wait while comments are loading...