»   » రంగస్థలం తరువాత సైరానే.. అక్కడే భారీగా!

రంగస్థలం తరువాత సైరానే.. అక్కడే భారీగా!

Subscribe to Filmibeat Telugu

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రికార్డులు తిరగరాస్తోంది. రంగస్థలం చిత్రం రాంచరణ్ కెరీర్ లోనే అతిపెద్ద విజయంగా నిలిచింది. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేసి రంగస్థలం గ్రామాన్ని నిర్మించారు. ఆ సెట్ రంగస్థలం చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ సెట్ వర్క్ ని ప్రముఖులంతా అభినందించారు.

తాజగా సమాచారం ప్రకారం రంగస్థలం సెట్ లో మెగాస్టార్ సైరా చిత్రం షూటింగ్ జరుపుకోబోతున్నట్లు తెలుస్తోంది. రంగస్థలం చిత్రం కోసం వేసిన సెట్ లోనే మరో భారీ సెట్ నిర్మించి సైరా తదుపరి షెడ్యూల్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చరిత్ర ఆధారంగా ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

Sye Raa movie next schedule at Rangasthalam set

సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రానికి నిర్మాత.

English summary
Sye Raa movie next schedule at Rangasthalam set. Huge set planning for SyeRaa movie
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X