Don't Miss!
- News
తెలంగాణా బడ్జెట్ సమావేశాలు: గవర్నర్ ప్రసంగంపై అందరిలోనూ ఉత్కంఠ!!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
‘సైరా’ సంచలనం: రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా.. టాలీవుడ్‌లో ఫస్ట్ మూవీ ఇదే.!
'ఖైదీ నెంబర్ 150'తో తన రీఎంట్రీని ఘనంగా చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవడంతో, ఆయన రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయారు. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం 'సైరా: నరసింహారెడ్డి'. ఇందులో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషించగా, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించాడు. ఈ సినిమాను రామ్ చరణ్ స్వయంగా నిర్మించాడు.
ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ కథను అందించారు. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం విడుదలైంది. తాజాగా 'సైరా' అదిరిపోయే రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు. ఇంతకీ ఏంటా రికార్డు..?

భారీ అంచనాలతో వచ్చింది.. ఈ ఫలితం పొందింది
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవికి సరైన హిట్ ఇవ్వాలనే పట్టుదలతో నిర్మించిన చిత్రమే ‘సైరా: నరసింహారెడ్డి'. ఎన్నో అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరించారు. మొదటి ఆట నుంచీ దీనికి మొత్తంగా మంచి టాక్ కూడా వచ్చింది. కానీ, కలెక్షన్లను రాబట్టడంలో మాత్రం ఈ సినిమా విఫలమైంది.

వంద కోట్లు మార్కును దాటింది
క్రేజ్ కాంబినేషన్.. భారీ అంచనాలు ఉన్న సినిమా కావడంతో ‘సైరా: నరసింహారెడ్డి' ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జరిగింది. దీనికి తోడు అన్ని భాషలకు చెందిన నటులు ఉండడంతో సినిమాపై బాగా హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషలు, ప్రాంతాలను కలిపి మొత్తంగా రూ. 130 కోట్లు షేర్ దక్కించుకుంది. అలాగే, రూ. 300 కోట్లు గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

అనుకున్నది ఒక్కటి.. అయినది మరొకటి
సినిమా టాక్ బాగుండడంతో కలెక్షన్లు కూడా భారీగానే ఉంటాయని అంతా అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా జరిగింది. మొత్తంగా అన్ని ఏరియాల్లో కలిపి ఈ చిత్రం రూ.152.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ నమోదైంది. అయితే, ఈ సినిమా క్లోజింగ్ బిజినెస్ రూ.133 కోట్ల వద్ద ఆగిపోవడంతో దాదాపు రూ. 20 కోట్లకు పైగా నష్టం వచ్చినట్లు ట్రేడ్ పండితులు వెల్లడించారు.

అక్కడ మాత్రం బాగా ఆదరించారు
బడా హీరో, భారీ బడ్జెట్ సినిమా కావడంతో అమెజాన్ సంస్థ ‘సైరా: నరసింహారెడ్డి' సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేసిందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా స్ట్రీమింగ్ ఇటీవల ప్రారంభం అయింది. దీంతో చాలా మంది ఈ సినిమాను వీక్షించేందుకు క్లిక్స్ చేస్తున్నారని ఆ సంస్థ వెల్లడించినట్లు వార్తలు వస్తున్నాయి.

రికార్డ్ క్రియేట్ చేసిన చిరంజీవి సినిమా
ఫలితం ఎలా ఉన్నా ఈ సినిమా తమిళంలో రికార్డు క్రియేట్ చేసింది. ఇటీవల టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయిన ‘సైరా' తమిళ వెర్షన్‌కు 15.4 టీఆర్పీ వచ్చింది. దీంతో అక్కడ ఈ స్థాయి రేటింగ్ సాధించిన మొదటి తెలుగు సినిమా రికార్డు సాధించింది. చిరంజీవికి తమిళనాడులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వల్లే ఇది సాధ్యమైందని విశ్లేషకులు చెబుతున్నారు.