»   » తెలంగాణ ఫిల్మ్ మేకర్ వరల్డ్ రికార్డ్....

తెలంగాణ ఫిల్మ్ మేకర్ వరల్డ్ రికార్డ్....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతానికి చెందిన ఫిల్మ్ మేకర్ సయిద్ రఫీ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఒక సినిమాకు అత్యధిక విభాగాలకు సేవలు చేసిన వ్యక్తిగా అతను మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు ఆయన మిరాకిల్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ నుండి అవార్డు అందుకున్నారు. ‘యంగెస్ట్ సింగిల్ పర్సన్ హాండిల్డ్ మాగ్జిమమ్ క్రాప్ట్స్ అండ్ డిపార్టుమెంట్స్ ఇన్ ఫిల్మ్ మేకింగ్' టైటిల్ తో ఆయనకు ఈ అవార్డు అందజేసారు.

Syed Rafi creates world record

స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే రైటింగ్, డైలాగ్ రైటింగ్, లిరిక్ రైటింగ్, మ్యూజిక్ డైరెక్షన్, సింగింగ్, కొరియోగ్రఫీ, ఫైట్ మాస్టర్, ఆర్ట్ డైరెక్షన్, కాస్ట్యూమ్ డిజైనింగ్, ప్రొడక్షన్ డిజైనింగ్, కాస్టింగ్ డైరెక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ ఇలా సినిమా రంగంలోని వివిధ విభాగాల్లో ఆయన పని చేసారు.

రఫీ ఆ మధ్య ‘ఇంకెనాళ్లు' అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలసిందే. ఏపీ ఫిల్మ్ చాంబర్ కు పోటీగా ‘తెలంగాణ ఫిల్మ్ చాంబర్' ఏర్పాటులో కీలక భూమిక పోషించారు.

English summary
Telangana filmmaker, actor Syed Rafi was named as "Youngest Single Person Handled Maximum Crafts and Departments in Film Making" by Miracles World Records.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu