twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'మిస్ మ్యాచ్' స‌మాజంతో మ్యాచ్ కావాలని కోరుకుంటున్నా: మంత్రి హరీష్ రావు

    |

    ఎన్ వి. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'మిస్ మ్యాచ్'. జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని క్లీన్ 'యు' సర్టిఫికెట్ పొందింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 6న విడుదలకు సిద్ధమైంది.

    చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఘనంగా 'మిస్ మ్యాచ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. సోమ‌వారం జ‌రిగిన ఈ వేడుకకు తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు, స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేశ్ ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు, దేశ‌ప‌తి శ్రీనివాస్‌, శ్రీవిష్ణు స‌హా ఎంటైర్ యూనిట్ ఈ వేడుక‌లో సందడి చేశారు.

    T. Harish Rao and Raghavendra Rao Comments On Miss match

    ఈ సందర్బంగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు మాట్లాడుతూ ''ఉద‌య్‌శంక‌ర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. విక్ట‌రీ వెంక‌టేశ్‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్, త్రివిక్ర‌మ్‌, సురేంద‌ర్ రెడ్డి చెప్పారు. ఐశ్వ‌ర్యా రాజేష్ గురించి చెప్పాలంటే ముందుగా ఆవిడ అమ్మ‌గారు గురించి చెప్పాలి. ఆవిడ ఎంతో క‌ష్ట‌ప‌డి ఎదిగారు. నాతో పాటు 50-60 సినిమాల‌కు క‌లిసి ప‌నిచేశారు. కౌసల్య కృష్ణ‌మూర్తితో ఐశ్వ‌ర్య తెలుగులో సిక్స‌ర్ కొట్టింది. ఇప్పుడు ఈ సినిమాలో తను చేసే బాక్సింగ్‌తో బాక్సాఫీస్ బద్దలవుతుంది. నిర్మ‌ల్ కుమార్ తొలి సినిమా 'స‌లీమ్‌'ను చ‌క్క‌గా తెర‌కెక్కించాడు. డిసెంబ‌ర్ 6న సినిమా విడుద‌ల‌వుతుంది'' అన్నారు.

    తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. ''శ్రీరాం గారిపై ఉన్న గౌర‌వంతో నేను ఇక్క‌డ‌కు వ‌చ్చాను. ఇప్పుడు సినిమాల్లో కొత్త భావ‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌తో, కొత్త క‌థ‌ల‌తో, కొత్త ద‌ర్శ‌కులు, న‌టీన‌టులు అద్భుత‌మైన విజ‌యాల‌ను సాధిస్తున్నారు. 'మిస్ మ్యాచ్' కూడా అదే కోవ‌లో క‌న‌ప‌డుతుంది. ఓ ప్రేమికురాలి విజ‌యం కోసం ప్రేమికుడు ప‌డే త‌ప‌న‌ను చూపించే చిత్ర‌మిది. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ చిత్ర‌మ‌ని అర్థ‌మ‌వుతుంది. ప్రేమ మ‌నిషిని విజ‌యప‌థం వైపు న‌డిపించాలి.

    అలా పాజిటివ్ డైరెక్ష‌న్‌లో ఉండాలే కానీ.. వికృత రూపం తీసుకోకూడ‌దు. ఉద‌య్‌శంక‌ర్ 15 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డ‌ర్‌. నిజ జీవితంలోలాగానే తెలివైన ఐఐటీ స్టూడెంట్‌గా యాక్ట్ చేశాడు. సినిమాల్లో మంచి సందేశం ఉండాలి. సినిమాల‌తో గౌర‌వం పెర‌గాలి. వ్య‌క్తిత్వం ప్ర‌తిబింబించేలా సినిమాలుండాలి. మ‌హిళ‌ల గౌర‌వం పెరిగేలా సినిమాలుండాలి. అలాంటి ఓ మంచి సినిమా ఇదని అర్థ‌మ‌వుతుంది. మిస్ మ్యాచ్ స‌మాజంతో మ్యాచ్ కావాలని, మంచి విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను'' అన్నారు.

    English summary
    Telangana Minister T. Harish Rao and senior director Raghavendra Rao Support For small movie Miss match. In this movie Pre release event they says about this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X