పరిమితి, వివక్ష ఎందుకు.. 17 ఏండ్ల తర్వాత మళ్లీ టబూ!
విలక్షణ నటి టబూ దాదాపు 17 ఏండ్ల తర్వాత మళ్లీ కామెడీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా రూపొందిస్తున్న గోల్‌మాల్ 4 చిత్రంలో నటించేందుకు అంగీకరించారు.
విలక్షణ నటి టబూ దాదాపు 17 ఏండ్ల తర్వాత మళ్లీ కామెడీ చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారు. ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి తాజాగా రూపొందిస్తున్న గోల్‌మాల్ 4 చిత్రంలో నటించేందుకు అంగీకరించారు. ఈ విషయాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి, బాలీవుడ్ నటులు పరిణితి చోప్రా, అజయ్ దేవ్ గణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. టబూ చేరికను వారందరూ స్వాగతించారు.
టబూ నటించే గోల్ మాల్ 4 చిత్ర షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానున్నది. టబూ 17 ఏండ్ల క్రితం అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావెల్ తో కలిసి హెరాపెరీలో నటించిన సంగతి తెలిసిందే.

గోల్ మాల్ 4 చిత్రంలో నటించడంపై టబూ స్పందిస్తూ అన్ని రకాల చిత్రాల్లో నటించాలని ఉంటుందని, కళాకారులకు ఫలానా చిత్రాల్లో నటించాలన్న పరిమితులు, వివక్ష ఉండకూడదని అన్నారు.
టబూ నటించే గోల్ మాల్ 4 చిత్ర షూటింగ్ వచ్చే నెల ప్రారంభం కానున్నది. టబూ 17 ఏండ్ల క్రితం అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావెల్ తో కలిసి హెరాపెరీలో నటించారు.


Click it and Unblock the Notifications











