»   » షాకింగ్ : తాగుబోతు రమేష్ రెమ్యూనరేషన్ అంతా?

షాకింగ్ : తాగుబోతు రమేష్ రెమ్యూనరేషన్ అంతా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'అలా మొదలైంది' చిత్రంతో తాగుబోతు పాత్రలో అందరినీ మెప్పించిన రమేష్....ఆ తర్వాత వరుస అవకాశాలతో స్టార్ కమెడియన్ల జాబితాలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఊపిరిసలపనంత బిజీ అయిపోయాడు. తన కామెడీకి డిమాండ్ పెరగడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచేసాడు.

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో బ్రహ్మానందం రోజుల లెక్కన లక్షల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అదే తరహాలో తాగు రమేష్ కూడా రోజుల లెక్కన రెమ్యూనరేషణ్ వసూలు చేస్తున్నాడట. అతగాడి రెమ్యూనరేషన్ రోజుకు రూ. లక్ష అని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు.

Tagubothu Ramesh remuneration

తాగుబోతు రమేష్ 2005లో 'జగడం' చిత్రం ద్వారా కెరీర్ ప్రారంభించాడు. మహాత్మ, భీమిలి కబడ్డీ జట్టు, ఈ వయసులో చిత్రాల్లో నటించాడు. అయితే ఈ చిత్రాలు రమేష్‌కు పెద్దగా గుర్తింపు తేలేదు. నాని హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన 'అలా మొదలైంది' చిత్రంలో క్లైమాక్స్ సీన్లో రామేష్ పోషించిన తాగుబోతు పాత్ర సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. ఈ ఒక్క సినిమాతో తాగుబోతు రమేష్‌గా పాపులరయ్యాడు.

రమేష్‌ది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. తండ్రి సింగరేణి బొగ్గుగనుల్లో కార్మికుడు. ఆయన నిత్యం మద్యం తాగి ఇంటికి తూలుతూ రావడం, కేకలు వేయడం వంటివి చిన్నప్పటి నుంచి చూసిన రమేష్.......తాగుబోతులను ఇమిటేట్ చేయడం ప్రాక్టీస్ చేసే వాడు. నటనపై ఆసక్తితో సినిమా రంగం వైపు అడుగులు వేసి సక్సెస్ అయ్యాడు.

English summary

 Tagubothu Ramesh too has gained popularity in short span of time. The actor is currently following the suite of Brahmi and is asking Rs. 1 lakh per day of shooting as his remuneration.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu