»   » వేరీజ్ ద తెల్లజుట్టు??? నమ్మలేరు "తలా 57" కోసం అజిత్ స్టన్నింగ్ లుక్

వేరీజ్ ద తెల్లజుట్టు??? నమ్మలేరు "తలా 57" కోసం అజిత్ స్టన్నింగ్ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అజిత్ ప్రస్తుతం తాను నటిస్తోన్న 57వ సినిమాను శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కన్ ఫాం కాని ఈ సినిమా ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో అజిత్ ఇంటర్‌పోల్ ఆఫీసర్‌గా కనిపించనుండగా, కాజల్ అగర్వాల్, అక్షరా హాసన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంత కాలంగా తన వయసుకు తగ్గ పాత్రల్లో మాత్రమే కనిపిస్తున్న అజిత్, కొత్త సినిమాలో స్కిన్ టైట్ టీషర్ట్ లో కండలు తిరిగిన బాడీతో కనిపిస్తున్నాడు.

Tala Ajith's stunning third look for Thala 55

అంతేకాదు ఈ మధ్య వచ్చిన సినిమాలన్నింటిలో తెల్ల గడ్డంతో కనిపించిన తలా.., కొత్త సినిమాలో నీట్ షేవ్ లో కుర్రాడిలో దర్శనమివ్వనున్నాడు. అజిత్ సరసన కాజల్ అగర్వాల్, అక్షర హాసన్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ నెగెటివ్ షేడ్ లో కనిపించనున్నాడు. ఇటీవలే యూనిట్ తో జాయిన్ అయిన వివేక్ బల్గేరియా అందాలను తన ట్విట్టర్ ద్వారా పరిచయం చేశాడు.

తల 57 చిత్ర యూనిట్ ప్రస్తుతం షూటింగ్ తో బిజీగా ఉండగా, చిత్ర దర్శకుడు శివ తన ట్విట్టర్ ద్వారా అజిత్ లుక్ రివీల్ చేశాడు. ఈ లుక్ ని చూసిన అభిమానులు తమ అభిమాన హీరో లుక్ చాలా స్టన్నింగ్ గా ఉందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.అజిత్ లేటెస్ట్ పిక్చర్ లో చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. ఇంటర్ పోల్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ 'వేదాళం' స్టార్ లుక్ అభిమానులనే కాక సినీప్రియులనూ ఉర్రూతలూగిస్తుందని దర్శకుడు సిరుతై శివ చెప్తున్నారు. దానికి తగ్గట్టే అజిత్ కనిపిస్తుండడంతో ఈ సినిమా ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరిగిపోతున్నాయి.

Tala Ajith's stunning third look for Thala 55

అజిత్ 57వ సినిమాలో కాజల్ కథానాయి. సినిమాను చాలా వరకు యూరప్ లోనే ప్లాన్ చేశారు. చాలా కాలంగా అజిత్ తన ఒరిజినల్ లుక్ తోనే చిత్రాల్లో సందడి చేశారు. అయితే కొత్త పిక్చర్ కు ఆయన ఆహార్యంలో గణనీయమైన తేడా ఉంది. అజిత్ వర్కవుట్స్ చేసి మంచి యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో ఈ సినిమాలో ఆయన అద్భుతాలే చేస్తారని అభిమానులు సంబరపడిపోతున్నారు.

తమ ఫేవరెట్ హీరో ఖాతాలో మరో భారీ విజయం ఖాయమని విశ్వసిస్తున్నారు. ఇక తల 57 చిత్రం ఈ నెలాఖరుతో బల్గేరియా షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియాకి రానుంది. జనవరిలో ఈ చిత్రం మరో షెడ్యూల్ కి వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ లో అజిత్ సరసన కథానాయికగా కాజల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.

English summary
Ajith has once again stirred a storm on the internet with a picture that is going viral where the actor is seen with a skullcap and aviator shades, flexing his biceps for his next espionage thriller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu