For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  "నంది" పై మహేష్ కామెంట్ నిజమా? అబద్దమా.?: అవార్డుల వేళ "ఆ వ్యాఖ్యలు" మళ్ళీ తెరమీదకి

  |
  'నంది' పై మహేష్ కామెంట్ నిజమా?

  మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నంది అవార్డుల పండగ రానే వచ్చింది. మొత్తానికి అభిమానులంతా ఆనందం లో మునిగిపోయారు. అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రం మరింత ఆనందం లో ఉన్నారు. ఎందుకంటే ఈ నంది ప్రిన్స్ ఖాతాలో పడ్డ ఎనిమిదవది ఇప్పటివరకూ సాధించిన ఏడు నందుల సరసన మరో నందిని శ్రీమంతుడు సాధించాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న అంశం తెర మీదకి వచ్చింది.

  వివాదాస్పద కామెంట్

  వివాదాస్పద కామెంట్

  ఓ మూడు నెలలకింద టాలీవుడ్ లో ఒక రూమర్ చక్కర్లు కొట్టింది, అదేమిటంటే నంది అవార్డుల విషయంలో మహేష్ బాబు వివాదాస్పద కామెంట్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయన ఎప్పుడు? ఎక్కడ? ఈ విషయం గురించి మాట్లాడారు అనే విషయంపై మాత్రం సరైన క్లారిటీ లేదు గానీ ఆ సమయం లో మహేష్ మీద ఇలాంటి వార్త ఒకటి వినిపించింది.

  నంది అవార్డ్స్ నిర్వాహకులు

  నంది అవార్డ్స్ నిర్వాహకులు

  ఓసారి నంది అవార్డ్స్ నిర్వాహకులు తనకు ఓ సినిమా విషయంలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపిక చేస్తామన్నారని, అయితే ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడానికి డొనేషన్ అడిగారని మహేష్ బాబు చెప్పినట్లు....వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతేకాదు అలా అడిగిన వాళ్లకి మహేష్ సమాధానం కూడా సరిగ్గా ఇచ్చాడంటూ చెప్పుకున్నారు.

  ప్రచారంలోకి వచ్చిన వార్త

  ప్రచారంలోకి వచ్చిన వార్త

  అయితే డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కునే స్థితిలో తాను లేనని తాను తిరస్కరించడంతో ఆ అవార్డు మరొక వ్యక్తికి కేటాయించారని మహేష్ బాబు చెప్పినట్లు...... సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన వార్తలోని సారాంశం. అన్ని అవార్డులు కొనుక్కుంటే వచ్చినవే అని నేను అనడం లేదు, కొన్ని సందర్భాల్లో ఇలాంటివి జరుగుతాయని నాకు జరిగిన అనుభవంతో తెలుసుకున్నాను అని మహేష్ బాబు చెప్పాడట

   మూడునెలలు కూడా కాకముందే

  మూడునెలలు కూడా కాకముందే

  ఆ వార్తలు వచ్చి మూడునెలలు కూడా కాకముందే ఇంకో నంది అవార్డ్ సూపర్‌స్టార్ ఖాతాలో చేరటం తో అప్పటి వార్తలు మళ్ళీ ఒకసారి పైకి వచ్చాయి. అయితే అవన్నీ గాలివార్తలుగానే కొట్టేసిన మహేష్ అభిమానులు మాత్రం తమ సంబరాల్లో తాము మునిగిపోయారు.

  2015 సంవత్సరానికిగానూ

  2015 సంవత్సరానికిగానూ

  ‘రాజకుమారుడు'తో డెబ్యూ హీరోగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి తొలి నందిని అందుకున్నారు. తాజాగా ఎ.పి ప్రభుత్వం ప్రకటించిన నంది పురస్కారాల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2015 సంవత్సరానికిగానూ ‘శ్రీమంతుడు' చిత్రానికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం ఆయన్ని వరించింది.

  గౌతమ్ కృష్ణ కూడా ఉత్తమ బాల నటుడిగా

  గౌతమ్ కృష్ణ కూడా ఉత్తమ బాల నటుడిగా

  దీనితో మహేశ్‌ ఖాతాలో ఎనిమిది నందులు చేరాయి. ఈ సారి ప్రత్యేకత ఏంటంటే.. మహేశ్‌తోపాటు ఆయన తనయుడు గౌతమ్ కృష్ణ కూడా ఉత్తమ బాల నటుడిగా ‘1 నేనొక్కడినే'కు నంది అవార్డును అందుకోవడం. ఏ తండ్రికైనా ఇంతకు మించిన ఆనందం ఏముంటుంది. బాలనటుడిగానే తేరమీదకు వచ్చిన ప్రిన్స్ కి అప్పట్లో అవార్దులేమీ రాకపోయినా ఇప్పుడు అదే విభాగం లో గౌతమ్‌కీ అవార్డ్ రావటం పట్ల ఫ్యాన్స్ మరింత ఆనందంగా ఉన్నారు...

  English summary
  Social media buzz is that, Super Star Mahesh Babu in a candid interview made startling revelation on buying and selling of awards. He said that organizers of ‘Nandi Awards’ once promised to give him the Best Actor award for a particular film, if he should donate some funds for organising the function.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X