»   » తెరవెనుక చాలా జరుగుతాయంటూ తమన్నా

తెరవెనుక చాలా జరుగుతాయంటూ తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెర వెనుక ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ అందరూ అవే మాట్లాడుకొంటారు. ఇంతకంటే విచిత్రం ఎక్కడ ఉంటుంది? తెరవెనుక జరిగే విషయాలపై ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే అందులో నిజాలు మాత్రం వాళ్లకు తెలియవు '' అంటోంది తమన్నా.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమన్నా మాట్లాడుతూ '' హీరోయిన్స్ మధ్య పోటీ ఉంది. కాదనను.. కానీ ఒకరితో ఒకరికి స్నేహమూ ఉంది. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో అనుష్క నాకు బాగా సహకరించింది. కాస్ట్యూమ్స్‌ విషయంలో సలహాలు ఇచ్చింది. నా కోసం కాస్ట్యూమ్‌ డిజైనర్‌ విషయంలోనూ సహాయ పడింది. పోటీ అనుకొంటే అంత సహాయం ఎందుకు చేస్తుంది? '' అంటూ చెప్పుకొచ్చింది. అనుష్క తో తమన్న పోటి ఉంది అంటూ వచ్చిన వార్తలు నేపద్యంలో ఆమె ఇలా స్పందించింది.

Tamanna about her friend ship with Anushka

అలాగే...''చిత్రసీమలో పోటీ గురించి, హీరోయిన్స్ అందుకొనే పారితోషికాల గురించి రకరకాలుగా మాట్లాడుకొంటుంటారు. అయితే అందులో నిజాలు మాత్రం వాళ్లకు తెలియవు'' అంటూ తెర వెనక మనకు తెలియని చాలా ప్రపంచం ఉంటుందని పాజిటివ్ నోట్ తో చెప్పుకొచ్చింది తమన్నా.

ప్రస్తుతం 'బాహుబలి','బెంగాల్‌ టైగర్‌' చిత్రాల్లో నటిస్తోంది తమన్నా. ఈ మధ్య బంగారు నగలకు సంబంధించిన ఆన్‌లైన్‌ వ్యాపారంలోనూ అడుగుపెట్టింది. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోందామె. తమిళం, హిందీ భాషల్లో నటిస్తున్నా... నన్ను తెలుగు హీరోయిన్ గానే గుర్తిస్తుంటారని చెబుతోంది. త్వరలోనే ఆమె 'బాహుబలి' చిత్రంతో సందడి చేయబోతోంది. మరోపక్క 'బెంగాల్‌ టైగర్‌'లో రవితేజ సరసన ఆడిపాడుతోంది.


తమన్నా మాట్లాడుతూ... ''తెలుగు హీరోయిన్ అనిపించుకోవడాన్ని గర్వపడతా. ఇక్కడ నేను చేసిన సినిమాలే నాకు ఆ గుర్తింపును తెచ్చిపెట్టాయి. అయినా... నటీనటులకు భాషాభేదాలు ఉండవు. తమిళం, హిందీ చిత్రాలతోనూ ప్రేక్షకులకు చేరువ కావడం ఎంతో సంతృప్తినిచ్చింది''అని చెబుతోంది.

అలాగే... ''సొంతంగా నిర్ణయాలు తీసుకొనేంత స్థాయికి ఎప్పుడో వచ్చాను. హీరోయిన్ గా ప్రయాణం మొదలైన తక్కువ సమయంలోనే ఆ పరిణతిని సాధించా. అలాగని ప్రతిదీ నాకు నచ్చినట్టు చేయను. అప్పుడప్పుడు సన్నిహితుల అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకొంటా. చివరికి మాత్రం మనసు ఏం చెబితే అదే చేస్తా'' అని చెబుతోంది తమన్నా.

ఇక సినిమాల ఎంపిక విషయంలో ఎవరిపైనైనా ఆధారపడుతుంటారా? అని అడిగితే ''కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సన్నిహితులతో చర్చిస్తుంటానంతే. ఎంపిక మాత్రం నాదే. అలా చేయడమే సబబు అని నమ్ముతా. మన మనసు చెప్పిందే చేసుంటాం కాబట్టి... వాటి ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరిస్తాము''అని సెలవిచ్చింది తమన్నా.

English summary
Tamanna said ...that her close friend is Anushka and she help her in starting days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu