»   » పెళ్లి వార్తలపై స్పందించిన హీయిన్ తమన్నా

పెళ్లి వార్తలపై స్పందించిన హీయిన్ తమన్నా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌత్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి రెండు మూడు రోజులుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ని చాలా కాలంగా డేటింగ్ చేస్తోందని,వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని, అందుకు పెద్దలు అనుమతి కూడా ఇచ్చినట్లే అంటూ నేషనల్ మీడియాలో సైతం వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి పెళ్లి అనంతరం తమన్నా సినిమాలకు దూరం కానుందని....పెళ్ళయ్యాక సినిమాలు మానేసి.. తాను స్థాపించిన గోల్డ్ డిజైన్ కంపెనీ వైట్ అండ్ గోల్డ్ బిజినెస్ చూసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తల్లో రాసుకొచ్చారు.

Tamanna Bhatia dismissed rumours over marriage

అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలే అని తమన్నా కొట్టి పారేసింది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన తనకు లేదని దక్షిణాది తమన్నా స్పష్టం చేసింది. తన పెళ్లి గురించి వస్తున్న కథనాలన్నీ అవాస్తవమని తెలిపింది.

పెళ్లి వార్తలను తాను గతంలో ఖండించినప్పటికీ మళ్లీ అవే కథనాలు వస్తున్నాయని మిల్కీ బ్యూటీ చెప్పింది. ప్రస్తుతం తాను ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న త్రిభాషా చిత్రం షూటింగ్ లో ఉన్నట్లు పేర్కొంది. తన పెళ్లి వార్త ఏదైనా ఉంటే ముందుగానే అందరికీ చెబుతానని తమన్నా చెప్పింది.

English summary
“This is a false news. I am not getting married. The day I get someone in my life I will let the world know about it first. I am currently busy shooting for Prabhudeva’s next and few south films,” Tamanna said in a statement.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu