Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
తమన్నా, నిర్మాత గొడవ అసహ్యకరంగా...!
ముంబై : హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నిర్మాత సలీమ్ అక్తర్ గొడవ ముదిరి అసహ్యకరంగా మారుతోంది. తమన్నా 2003లో సలీమ్ అక్తర్ నిర్మించిన హిందీ చిత్రం 'చాంద్ సా రోషన్ చెహ్రా' చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు గాను ఐదు సంవత్సరాల పాటు తమన్నా నటించే సినిమాలకు సంబంధించిన పారితోషికంలో 25 శాతం ఇవ్వాలని సలీమ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెబుతున్నాడు.
స్టార్ హీరోయిన్ గా ఎదిగి బాగా సంపాదిస్తున్నప్పటికీ...ఒప్పందం ప్రకారం తమన్నా తనకు డబ్బు చెల్లించ లేదంటూ సలీమ్ అక్తర్ తమన్నాకు నోటీసులు పంపాడు. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో కోల్‌కతా హై కోర్టును ఆశ్రయించాడు. చలన చిత్ర, టీవీ నిర్మాతల సంఘంతో కలిసి కంప్లైంట్ ఫైల్ చేసాడు.
అయితే తమన్నా తండ్రి సంతోష్ భాటియా మాత్రం సలీమ్ అక్తర్ ఆరోపణలను ఖండిస్తున్నారు. తన కూతురు తమన్నాకు, సలీమ్ అక్తర్ మధ్య ఎలాంటి ఒప్పందం కుదరలేదని వాదిస్తున్నాడరు. 2003లో తన కూతురు ఇంకా మైనరే అని, మైనర్ తో ఒప్పందం ఎలా కుదుర్చుకుంటాడని సంతోష్ భాటియా ప్రశ్నిస్తున్నారు.
ప్రస్తుతం తమన్నా బాలీవుడ్లో హిమ్మత్ వాలా చిత్రంలో నటిస్తోంది. అజయ్ దేవగన్ హీరోగా ' హిమ్మత్ వాలా ' చిత్రం రూపొందుతోంది. ఈ చిత్ర దర్శకుడు సాజిద్ ఖాన్ ఈ పాత్రకి తమన్నానే కరెక్ట్ అని నిర్ణయించుకొని ఆమెను ఒప్పించారు. 1980 లో జితేంద్ర, శ్రీ దేవి జంటగా నటించిన సూపర్ హిట్ చిత్రం 'హిమ్మత్ వాలా' చిత్రంకి రీమేక్ గా అదే పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సాజిద్ నదియాద్ వాల నిర్మాత.