»   » తమన్నాకి నచ్చిన తెలుగు సినిమాలివే (ఫొటో ఫీచర్)

తమన్నాకి నచ్చిన తెలుగు సినిమాలివే (ఫొటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిత్రసీమలో పోటీ ఎక్కువ అంటుంటారు. హీరోయిన్ గా రాణించడం చాలా కష్టమని చెబుతుంటారు. తమన్నా మాత్రం 'ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్ గా పరిశ్రమలో కొనసాగుతుండడం నా అదృష్టం' అని చెబుతోంది. ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో నెగ్గుకురావడం చాలా సులభం అంటోంది.

తమన్నా మాట్లాడుతూ ''కథలు ఇచ్చి పుచ్చుకోవడం ఇటీవల అధికమైంది. నటీనటుల మార్పిడి కూడా జరుగుతోంది. ఒక భాషకి చెందిన వారికి మరోచోట అవకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయి. మేమంతా తీరిక లేకుండా గడుపుతున్నామంటే కారణం అదే. మేమే కాదు... కొత్త వాళ్త్లెనా కాస్త ప్రతిభ చూపితే చాలు. స్థిరపడిపోయినట్టే'' అని చెప్పుకొచ్చింది తమన్నా.

సుదీర్ఘమైన మీ ప్రయాణంలో రకరకాల పాత్రల్ని పోషించారు కదా, స్వతహాగా మీరు ఎలాంటి పాత్రల్లో నటించడాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు అని అడిగితే... ''నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చాలా చేశాను. అందులో కొన్ని డీగ్లామరైజ్డ్‌ పాత్రలు కూడా ఉన్నాయి. వాటన్నిటికంటే వాణిజ్య ప్రధానమైన చిత్రాల్లో నటించడమే సాహసమనిపించింది. కథంతా హీరో చుట్టూనే తిరుగుతుంటుంది. ఆ సమయంలోనూ కథానాయికగా మా ముద్రవేయాల్సి ఉంటుంద''ని చెప్పుకొచ్చింది తమన్నా. ప్రస్తుతం ఆమె హిందీలో 'హమ్‌షకల్‌', 'ఇట్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌' చిత్రాల్లో నటిస్తోంది.

తన సినీ జీవితంలో ఇప్పటిదాకా పూర్తిస్థాయిలో సంతృప్తి ఇచ్చిన పాత్ర ఏదీ లేదని చెబుతోంది. 'నాకు ఎప్పట్నుంచో విలన్ షేడ్స్ లున్న పాత్ర చేయాలనుంది. ఆ అవకాశం వచ్చి, అది బాగా పండితే.. అదే నాకు నచ్చిన పాత్ర అవుతుంది' అని చెబుతోంది తమన్నా . పోనీ తెలుగులో మీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన, మీ నటనకు పదును పెట్టిన కొన్ని చిత్రాల గురించైనా చెప్పండి అంటే .. ఇలా మనసు విప్పింది.

స్లైడ్ షోలో..ఆమెకు నచ్చిన చిత్రాలు..

హ్యాపీడేస్‌

హ్యాపీడేస్‌

''తొలి నుంచి మనసుకు నచ్చిన పాత్రలే చేశాను. ప్రతి సినిమాను వంద శాతం ప్రేమించే నటించాను. అందుకే ఇది తక్కువ, అది ఎక్కువ అని చెప్పలేను. కాకపోతే అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ నటిగా తీరిక లేకుండా చేసిన చిత్రం మాత్రం నిస్సందేహంగా 'హ్యాపీడేస్‌'. అందులో పోషించిన మధు పాత్ర గురించి ఇప్పటికీ నాకు ఫోన్లు వస్తుంటాయి. ఆ మాటలు విన్నప్పుడు మనసు ఆనందంతో ఉప్పొంగిపోతుంది''.

చాలా ఇష్టం... 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం'

చాలా ఇష్టం... 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం'

''హ్యాపీడేస్‌' తర్వాత నాణ్యమైన ప్రేమకథ చేయాలనుకొన్నా. ఆ సమయంలోనే 'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' కథ వచ్చింది. నాకు ఆ సినిమా అంటే చాలా చాలా ఇష్టం. అందులో గీత పాత్రలో నటించా. గ్రామీణ నేపథ్యమున్న యువతి పాత్ర అది. ఆ తరహా పాత్రలో నటించడం అదే తొలిసారి. ఇప్పటికీ ఆ సినిమా చూసినప్పుడు ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది''.

వంద శాతం... '100%లవ్‌'

వంద శాతం... '100%లవ్‌'

''వ్యక్తిగతంగా నేను ఎలాంటి సినిమాల్ని చూడటానికి ఇష్టపడతానో... అలాంటి సినిమా '100%లవ్‌'. '100%లవ్‌'లో మహాలక్ష్మిలాంటి పాత్రలు అంటే వ్యక్తిగతంగా నాకు అమితమైన ఇష్టం. ఆ పాత్రలోని అమాయకత్వం నాకు బాగా నచ్చింది. నా లోని నటికి పని పెట్టిన సినిమా అది. సుకుమార్‌ ఒక దృశ్యకావ్యంలా తీశారు. నాగచైతన్యతో కలసి తెరను పంచుకోవడం సంతృప్తినిచ్చింది''.

పరిధి తక్కువే అయినా... 'రచ్చ'

పరిధి తక్కువే అయినా... 'రచ్చ'

''కమర్షియల్‌ చిత్రాలంటే హీరోయిన్స్ కు కత్తి మీద సాము అనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలోనూ హీరోనే కనిపిస్తాడు. కథానాయిక పరిధి తక్కువగా ఉంటుంది. ఉన్న ఆ కాస్త సమయంలోనే హీరోయిన్ తానేంటో నిరూపించుకోవాలి.అందుకే కమర్షియల్‌ చిత్రాలు అనగానే మరింత ఎక్కువగా కష్టపడానికి సిద్ధమైపోతా. నేను చేసిన కమర్షియల్‌ చిత్రాల్లో నాకు బాగా నచ్చింది 'రచ్చ'. అందులో రామ్‌చరణ్‌తో కలసి నటించా. ఇద్దరం డ్యాన్సులు ఇరగదీశాం అన్నారు చాలామంది. 'వానా వానా వెల్లువాయే...' పాటలో నేను మరింత అందంగా కనిపించా''.

ఎక్కువ కష్టపడ్డా 'ఎందుకంటే ప్రేమంట'

ఎక్కువ కష్టపడ్డా 'ఎందుకంటే ప్రేమంట'

''నేను చేసిన చిత్రాల్లో 'ఎందుకంటే ప్రేమంట' నాలో నటికి సవాల్‌ విసిరింది. ఫలితం మాట అటుంచితే... ఆ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డా. ప్యారిస్‌లో ఉండే ఓ భారతీయ యువతి పాత్రను అందులో పోషించా. తెరపై నేను కనిపించే విధానంలో వైవిధ్యం కోసం ఎంతగానో తపించా. వెస్ట్రన్‌ లుక్‌ కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకొని పనిచేశా.

రెండు కోణాలు..'వూసరవెల్లి'

రెండు కోణాలు..'వూసరవెల్లి'

'వూసరవెల్లి' సినిమాకూ అదే తరహాలోనే కష్టపడ్డా. రెండు కోణాల్లో సాగే పాత్రను అందులో పోషించా. అయితే చిత్రం విజయం సాధించలేదు. నాకు ఇష్టమైన పాత్ర అది.

ఆశ్చర్యమేసింది... 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు

ఆశ్చర్యమేసింది... 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు

''రకరకాల జీవితాల్ని తరచి చూసే అవకాశం నటీనటులకు మాత్రమే దక్కుతుందని నా అభిప్రాయం. 'కెమెరామెన్‌ గంగతో రాంబాబు' కోసం కెమెరాను చేతపట్టాను. ఆ పాత్ర పోషిస్తున్నప్పుడు విలేకరి జీవితం ఇంత కష్టంతో కూడుకొని ఉంటుందా అని ఆశ్చర్యం కలిగింది. పవన్‌కల్యాణ్‌తో కలసి తెరను పంచుకొనే అవకాశం ఈ సినిమాతో దక్కింది. సెట్‌లో ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి''.

ప్రస్తుతం...

ప్రస్తుతం...

మహేష్‌బాబు - శ్రీనువైట్ల కలయిక మరోసారి 'ఆగడు' సినిమాతో పునరావృతం కాబోతున్న సంగతి తెలిసిందే. 'దూకుడు' తరవాత వీరిద్దరి నుంచి వస్తున్న చిత్రమిది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా చాలా మందిని అనుకుని తమన్నాని ఖరారు చేశారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది.

English summary
Tamanna is back on the sets of Mahesh Babu’s ‘Aagadu’. Recently, Tamanna wrapped up the schedules of Bollywood flick ‘Hum Shakals’ and joined the sets of ‘Aagadu’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu