»   » తమన్నా ఆశ్చర్యం పోయిన క్షణాలు...

తమన్నా ఆశ్చర్యం పోయిన క్షణాలు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : సినీనటి తమన్నా విమానంలో హైదరాబాద్‌ వస్తోంది. ఈ ప్రయాణంలో తనతో పాటు ఇంకెవరైనా ఉంటే బాగుండేది అనుకుందట ఈ అమ్మడు. వెంటనే ఓ వ్యక్తి వచ్చి ఆమెను సంభ్రమాశ్చర్యానికి గురిచేసిందట. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో అనుకుంటున్నారా.. ఎవరో కాదండి, నటి కాజల్‌ అగర్వాల్‌. ఈ విషయాన్ని మిల్కీబ్యూటీ తమన్నా తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేసింది. దీనితో పాటు వాళ్లిద్దరూ తీసుకున్న ఓ సెల్పీని సైతం ట్విట్టర్‌లో పెట్టింది. ఆ ఫొటోని ఇక్కడ మీరు చూడండి.

తమన్నా కెరీర్ కు వస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ హీరోయిన్ పదేళ్లు చిత్రసీమలో కొనసాగిందంటే నిస్సందేహంగా ఓ రికార్డే. రోజుకో కొత్త అందం వెలుగులోకి వస్తున్న పరిస్థితుల్లో ఆ పోటీని తట్టుకొని అవకాశాలు చేజిక్కించుకోవడం ఆషామాషీ కాదు. ఆ విషయంలో దటీజ్‌ మహాలక్ష్మి అనిపించుకొంది తమన్నా. 'శ్రీ'తో ప్రయాణం మొదలుపెట్టిన ఆమె అటు అందంతోనూ, ఇటు నటనతోనూ అలరించింది. తిరుగులేని హీరోయిన్ గా వరుస విజయాలు అందుకొంది.

మొన్న శనివారం రాత్రి మృతి చెందిన మనోరమకు నివాళులు అర్పిస్తూ...

నటనలో తన శైలి గురించి తమన్నా చెబుతూ ''ఒక అడుగు ముందుకు పడిందంటే నా దృష్టి రెండో అడుగుపైనే ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకొనే అలవాటు ఎప్పుడూ లేదు. ఎప్పటికప్పుడు పరిణతి ఉన్న పాత్రల్లో నటించడంపైనే దృష్టిపెడుతుంటా'' అని వివరించింది.

''ప్రతి హీరోయిన్ కీ 'క్వీన్‌', 'కహానీ' లాంటి సినిమాలు దొరకవు. చేతికొచ్చిన కథల్ని, మన నటనతో మనమే ఆ స్థాయికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుందని గ్రహించాలి అంటోంది తమన్నా తక్కువ చేయలేం 'అరుంధతి', '100% లవ్‌','అలా మొదలైంది'లాంటి చిత్రాల్ని తక్కువగా చూడలేం. ఆ తరహా పాత్రల్ని రక్తికట్టించాలంటే ఎంతో పరిణతి కావాలి.

Tamannaah Bhatia super thrilled to meet Kajol

అందుకే .... ఏ కథల్నీ, పాత్రల్నీ తక్కువగా చూడకుండా, మనం వాటిని ఏ స్థాయిలో రక్తికట్టించగలమో ఆలోచించాలి. ఏదైనా కథ విన్నప్పుడు నాకు నప్పదనుకొంటే తిరస్కరిస్తాను తప్ప దర్శకుడి ఆలోచనల్ని, వాళ్లు రాసుకొన్న కథల్ని తక్కువగా అంచనా వేయను''అందితమన్నా. చేతిలో చిత్రాలు ఈమె రీసెంట్ గా బాహుబలిలో సందడి చేసింది. ప్రస్తుతం 'బెంగాల్‌ టైగర్‌'తో పాటు నాగార్జున- కార్తీ చిత్రంలోనూ నటిస్తోంది.

English summary
Tamannaah Bhatia ‏tweeted: We live on a plane🙈🙈🙈 super thrilled to meet my darling kaju #Traveldiaries #Hyderabad
Please Wait while comments are loading...