»   » జ్యూయలరీ డిజైనర్‌ గా తమన్నా,లోగో ఆవిష్కరణ (ఫొటోలు)

జ్యూయలరీ డిజైనర్‌ గా తమన్నా,లోగో ఆవిష్కరణ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటి తమన్నా డిజైనర్‌ అవతారమెత్తారు. తమన్నా స్వయంగా డిజైన్‌ చేసిన వజ్రాల నగలను తండ్రి సంతోష్‌ భాటియాతో కలిసి ఆన్‌లైన్‌ వ్యాపారం ద్వారా అమ్మకాలు సాగించనున్నారు. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న తన వ్యాపార సంస్థ తాలూకు లోగోను తమన్నా ఈరోజు తాజ్‌డెక్కన్‌లో ఆవిష్కరించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ.... చిన్నప్పటినుంచి జ్యూయలరీ అంటే తనకిష్టమని తెలిపారు. పలు దేశాల్లో తాను చూసిన డిజైనర్‌ నగలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త డిజైన్లను రూపొందించి వినియోగదారులకు అందించడం ఆనందంగా ఉందన్నారు.

బాలీవుడ్‌లో నటించినా తెలుగు సినిమాలకు తొలి ప్రాధాన్యం ఇస్తానని తమన్నా స్పష్టం చేశారు. ప్రస్తుతం బాహుబలితో పాటు అక్కినేని నాగార్జున, కార్తి హీరోలుగా నటిస్తున్న మరో చిత్రంలోనూ తాను నటిస్తున్నట్లు తమన్నా తెలిపారు.

స్లైడ్ షోలో ఈ ఈవెంట్ ఫొటోలు

'బాహుబలి'లో....

'బాహుబలి'లో....

తను పోషించిన పాత్ర గురించి తమన్నా చెబుతూ ''సినిమాలో నేనూ కత్తిపట్టి పోరాటాలు చేశా. ఆ విషయంలో రాజమౌళిగారు మార్గనిర్దేశం చేశారు.

ఫస్ట్ పార్ట్ లోనే..

ఫస్ట్ పార్ట్ లోనే..

'బాహుబలి' మొదటి భాగంలో పూర్తిస్థాయిలో కనిపిస్తా. రెండో భాగంలో నా పాత్ర పరిధి తక్కువగా ఉంటుంది.'' అంది తమన్నా.

అలాగే...

అలాగే...


రాజమౌళి తీస్తున్న సినిమా ఎలా ఉంటుందో అందులో నటించేవాళ్లకు కూడా పూర్తిగా తెలియదు. ఆ దృశ్యాలు కేవలం రాజమౌళి వూహల్లోనే ఉంటాయి.

అందుకే...

అందుకే...

'బాహుబలి' గురించి ఎవరైనా అడిగినప్పుడు... వూహకు కూడా అందని అంశాల్ని వూహించమని మాత్రం చెబుతుంటా'' అంది తమన్నా.

తెలుగే...

తెలుగే...

దక్షిణాదిలో.... స్టార్ హీరోయిన్ గా తమన్నా కొనసాగుతోందామె. తమిళం, హిందీ భాషల్లో నటిస్తున్నా... నన్ను తెలుగు హీరోయిన్ గానే గుర్తిస్తుంటారని చెబుతోంది.

రవితేజ సరసన

రవితేజ సరసన

త్వరలోనే ఆమె 'బాహుబలి' చిత్రంతో సందడి చేయబోతోంది. మరోపక్క 'బెంగాల్‌ టైగర్‌'లో రవితేజ సరసన ఆడిపాడుతోంది.

గర్వపడతా...

గర్వపడతా...

తమన్నా మాట్లాడుతూ... ''తెలుగు హీరోయిన్ అనిపించుకోవడాన్ని గర్వపడతా. ఇక్కడ నేను చేసిన సినిమాలే నాకు ఆ గుర్తింపును తెచ్చిపెట్టాయి.

అయినా...

అయినా...

నటీనటులకు భాషాభేదాలు ఉండవు. తమిళం, హిందీ చిత్రాలతోనూ ప్రేక్షకులకు చేరువ కావడం ఎంతో సంతృప్తినిచ్చింది''అని చెబుతోంది.

అయినా...

అయినా...

నటీనటులకు భాషాభేదాలు ఉండవు. తమిళం, హిందీ చిత్రాలతోనూ ప్రేక్షకులకు చేరువ కావడం ఎంతో సంతృప్తినిచ్చింది''అని చెబుతోంది.

ఎప్పుడో వచ్చా...

ఎప్పుడో వచ్చా...

''సొంతంగా నిర్ణయాలు తీసుకొనేంత స్థాయికి ఎప్పుడో వచ్చాను. హీరోయిన్ గా ప్రయాణం మొదలైన తక్కువ సమయంలోనే ఆ పరిణతిని సాధించా.

అదే చేస్తా

అదే చేస్తా

అలాగని ప్రతిదీ నాకు నచ్చినట్టు చేయను. అప్పుడప్పుడు సన్నిహితుల అభిప్రాయాలూ పరిగణలోకి తీసుకొంటా. చివరికి మాత్రం మనసు ఏం చెబితే అదే చేస్తా'' అని చెబుతోంది తమన్నా.

ఇక సినిమాల ఎంపిక విషయంలో ఎవరిపైనైనా ఆధారపడుతుంటారా?

ఇక సినిమాల ఎంపిక విషయంలో ఎవరిపైనైనా ఆధారపడుతుంటారా?

అని అడిగితే ''కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు సన్నిహితులతో చర్చిస్తుంటానంతే. ఎంపిక మాత్రం నాదే. అలా చేయడమే సబబు అని నమ్ముతా.

ఫలితం ఏమైనా

ఫలితం ఏమైనా

మన మనసు చెప్పిందే చేసుంటాం కాబట్టి... వాటి ఫలితాలు ఎలా వచ్చినా స్వీకరిస్తాము''అని సెలవిచ్చింది తమన్నా.

English summary
“Jewellery designing caught my fancy at an early age as my father is also into jewellery business. I liked what I designed initially and that encouraged me to venture into it further”, said Tamannaah Bhatia
Please Wait while comments are loading...