»   » ఐపీఎల్ ప్రారంభోత్సవంలో తమన్నా అందాల బౌన్సర్లు.. ఆ నలుగురు కూడా!

ఐపీఎల్ ప్రారంభోత్సవంలో తమన్నా అందాల బౌన్సర్లు.. ఆ నలుగురు కూడా!

Subscribe to Filmibeat Telugu
IPL 2018 : Tamannaah To Perform At The IPL 2018 Opening Ceremony

భారతీయులకు క్రికెట్ ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పొట్టి క్రికెట్ ఫార్మాట్ టి 20 లలో ఐపీఎల్ సరికొత్త విప్లవం తీసుకునివచ్చింది. వేలకోట్ల రూపాయల బిజినెస్ ఐపీఎల్ ద్వారా జరుగుతుంది. భారత క్రికెట్ బోర్డుకు ఐపీఎల్ కాసులు కురిపించే కల్ప తరువుగా మారిపోయింది. ఐపీఎల్ 2018 కు రంగం సిద్ధమైపోయింది. ఏప్రిల్ 7 ప్రారంభోత్సవ వేడుకతో ఐపీఎల్ పండుగ ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ తారల అందాలు, వారి నృత్య ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి.

 ప్రారంభోత్సవ వేడుకలో తారల తళుకులు

ప్రారంభోత్సవ వేడుకలో తారల తళుకులు

ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ తారలు వారి పెర్ఫామెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. ఏప్రిల్ 7 న అట్టహాసంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతోంది.

 గత ఏడాది మెరిసింది వీరే

గత ఏడాది మెరిసింది వీరే

గత ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకలో పరిణీతి చోప్రా, అమీ జాక్సన్ మరియు దిశా పటాని తాం పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు.

మిల్కీ బ్యూటీ అందాల అట్రాక్షన్

మిల్కీ బ్యూటీ అందాల అట్రాక్షన్

ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలో మిల్కీ బ్యూటీ తమన్న తన అందాలతో వేడెక్కించనుంది. తమన్నా యువతలో ఉన్నా ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సౌత్ లో మాత్రమే కాక తమన్నా బాలీవుడ్ చిత్రాలలో సైతం నటించింది.

ఆ నలుగురు కూడా

ఆ నలుగురు కూడా

తమన్నాతో పాటు మరి కొంత మంది బాలీవుడ్ తారలు ఐపీఎల్ వేదికపై మెరుపులు మెరిపించబోతున్నారు. జాక్వలిన్ ఫెర్నాండేజ్ మరియు పరిణితో చోప్రా ఐపీఎల్ వేదికపై డాన్స్ పెర్ఫామెన్స్ చేబోతున్నట్లు తెలుస్తోంది. ప్రారంభోత్సవ వేడుకలో స్టార్ హీరోలు హృతిక్ రోషన్ మరియు వరుణ్ ధావన్ కూడా పాల్గొనబోతున్నారు. రణవీర్ సింగ్ పాల్గొనాల్సి ఉండగా భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు.

English summary
Tamannaah to set the stage on fire at IPL opening ceremony. Jacqueline Fernandez and Parineeti Chopra also perform inth same event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X