»   » అల్లు అర్జున్ కొత్త చిత్రం ఎనౌన్స్ మెంట్ అయ్యింది, తమిళ డైరక్టర్ తో ఈ సారి

అల్లు అర్జున్ కొత్త చిత్రం ఎనౌన్స్ మెంట్ అయ్యింది, తమిళ డైరక్టర్ తో ఈ సారి

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై:రూమర్స్ నిజమయ్యాయి...అల్లు అర్జున్‌ హీరో గా తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం ఎనౌన్స్ మెంట్ అయ్యింది. గత కొన్నాళ్లుగా తెలుగు హీరో తో చిత్రం తెరకెక్కించడానికి లింగుస్వామి ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌, మహేష్ బాబులకు కథలు కూడా వినిపించారు. సికందర్‌(తమిళంలో అంజాన్‌) చిత్రంలో అల్లు అర్జునే నటించవలసింది. అప్పట్లో కుదరలేదు.

Tamil director Linguswamy - Allu Arjun film announced

ఇక ఈ చిత్రాన్ని జనవరి నుంచి షూటింగ్ మొదలెడతారు. తెలుగు,తమిళ భాషల్లో ఒకే సారి రూపొందనుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్ పై జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. గతంలో ఇదే బ్యానర్ పై లింగు సామి...సికిందర్ చిత్రాన్ని సూర్యతో చేసారు. ఆ ఎగ్రిమెంట్ తో రెండో సినిమా అదే బ్యానర్ లో చెయ్యాల్సి ఉంది. మిగతా వివరాలు త్వరలో తెలియనున్నారు.

కందర్‌ పరాజయంతో రెండేళ్లు విరామం తీసుకుని లింగుస్వామి కథ రాశారు. ఇది బన్నికి నచ్చిందని సమాచారం. బోయపాటి దర్శకత్వంలో బన్ని నటించిన 'సరైనోడు' చిత్రానికి ముందు ఈ కథ విని , ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఏ విషయం చెప్తానని బన్ని అన్నారట. అటుతిరిగి, ఇటు తిరిగి చివరకు బన్ని ఓకే చేసారు. ప్రస్తుతం విశాల్ తో లింగు సామి చేస్తున్న సండై కోడి 2 చిత్రం రిలీజ్ అనంతరం ఈ చిత్రం పట్టాలు ఎక్కించనున్నారు.

Tamil director Linguswamy - Allu Arjun film announced

అలాగే అల్లు అర్జున్ సైతం ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో చేస్తున్న దువ్వాడ జగన్నాధం పూర్తి చేసి, ఈ సినిమా షూటింగ్ కు వస్తారు. మలయాళంలో ఇప్పటికే బన్నికి మంచి మార్కెట్‌ ఉంది. అక్కడి స్టార్ హీరోల చిత్రాలతో సమానంగా అల్లు అర్జున్‌ సినిమాలు ఆడుతుంటాయి. తమిళంలో కూడా మార్కెట్‌ కోసం గత కొన్నాళ్లుగా అల్లు అర్జున్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. తన చిత్రాలను తమిళంలో అనువదిస్తున్నాడు. నేరుగా తమిళ దర్శకుడితో చిత్రం చేస్తే, మంచి ఫలితం ఉంటుందని భావించే ఓకే చేసాడంటున్నారు.

తమిళ నాట లింగు స్వామి మంచి పేరుంది. మాస్‌, యాక్షన్ కథల్ని అల్లుకోవడంలో ఆయన దిట్ట . స్క్రీన్ ప్లే కూడా వైవిధ్యంగా ఉంటుంది. అయితే గత రెండు సినిమాలు ఆయనకి చేదు అనుభవాల్ని మిగిల్చాయి. ఇలాంటి నేపధ్యంలో ఈ చిత్రం హిట్ అయితే ఆయన కెరీర్ మళ్లీ ట్రాక్ లో పడుతుంది.

English summary
Linguswamy is back in the camp of Allu Arjun. The movie was officially announced a while ago. Director Linguswamy will be making a movie with Allu Arjun from January and it will be produced by Studio Green’s Gnanavel Raja.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu