»   » తమిళ పవర్ స్టార్ అరెస్ట్.. కారణం అదే..

తమిళ పవర్ స్టార్ అరెస్ట్.. కారణం అదే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

చీటింగ్ కేసులో తమిళ నటుడు, డైరెక్టర్ పవర్ స్టార్ శ్రీనివాసన్‌ అరెస్ట్ అయ్యాడు. శ్రీనివాసన్‌ను చెన్నైలోని అన్నా నగర్‌లో అరెస్ట్ చేసి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచామని, కోర్టు ఆదేశాల మేరకు అతడిని ట్రాన్సిట్ వారెంట్‌పై ఢిల్లీకి తీసుకెళ్తున్నామని అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్) అరున్ కంపానీ తెలిపారు.

100 కోట్ల రుణం ఇప్పిస్తానని

100 కోట్ల రుణం ఇప్పిస్తానని

రూ.100 కోట్ల మేర రుణం ఇప్పిస్తానని చెప్పి పది కోట్ల రూపాయలు తీసుకొన్నాడని ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదు మేరకు శ్రీనివాసన్‌ను అరెస్ట్ చేశామని పోలీసుల తెలిపారు.

రూ.10 కోట్ల కమిషన్ నొక్కేసి

రూ.10 కోట్ల కమిషన్ నొక్కేసి

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన దిలీప్ పటానీ అనే వ్యాపారవేత్త ఫిర్యాదుతో 2010లో శ్రీనివాసన్‌పై చీటింగ్ కేసు నమోదైంది. రూ. 1000 కోట్ల రుణం ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి కమీషన్ కింద రూ.10 కోట్లు ముందే తీసుకొన్నాడు. రుణం ఇప్పించలేదు. తీసుకొన్న డబ్బు తిరిగి ఇప్పించలేదు. దాంతో దిలీప్ పటానీ పోలీసులను ఆశ్రయించారు. దాంతో ఆయనను అరెస్ట్ చేశామని ఈవోడబ్ల్యూ పోలీసులు తెలిపారు.

2013లో తీహార్ జైలులో శిక్ష

2013లో తీహార్ జైలులో శిక్ష

2013లో కూడా ఈ కేసులో శ్రీనివాసన్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి రెండు నెలలు తీహార్ జైలులో ఉంచారు. నిర్ణీత సమయంలో డబ్బు చెల్లిస్తాననే హామీతో బెయిల్‌పై విడుదలయ్యాడు. కానీ హామీ మేరకు తిరిగి డబ్బు చెల్లించడంలో విఫలమయ్యాడు.

తాజాగా రెండోసారి అరెస్ట్

తాజాగా రెండోసారి అరెస్ట్

ఈ నేపథ్యంలో మరోసారి శ్రీనివాసన్‌ను మంగళవారం ఉదయం చెన్నైలోని అన్నా నగర్‌లో అరెస్ట్ చేశారు. బెంగళూరులో కూడా శ్రీనివాసన్‌పై కేసు నమోదైంది. వ్యాపారవేత్తలు మస్రూర్ ఆలం, సజ్జద్ వాహబ్ అనే వ్యాపారవేత్తలను మోసగించారనే ఆరోపణలపై శ్రీనివాసన్‌పై బెంగళూరులో చీటింగ్ కేసు నమోదైంది. రూ.30 కోట్లు రుణం ఇప్పిస్తానని తమ వద్ద నుంచిరూ.90 లక్షలు తీసుకొన్నాడని శ్రీనివాసన్‌పై వారు ఆరోపణలు చేశారు.

12 చిత్రాల్లో నటన.. గోలీసోడా.. థలైవన్

12 చిత్రాల్లో నటన.. గోలీసోడా.. థలైవన్

వృత్తిరీత్య శ్రీనివాసన్ అక్యుపంక్చర్ డాక్టర్. ఆయన మొత్తం 12 చిత్రాల్లో నటించాడు. గోలీసోడా, థలైవన్, ఆర్య సూర్య ఆయన నటించిన చిత్రాలు. మరికొన్ని చిత్రాల్లో అతిథి పాత్రల్లో కనిపించాడు. పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. తమిళ చిత్ర పరిశ్రమలో పవర్‌స్టార్‌గా సుపరిచితులు.

English summary
An actor and director of Tamil film industry Srinivasan on Cheating charges. Based on a complaint filed by a Delhi-based businessman Srinivasan Arrested.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu