»   » సప్తగిరి హీరోగా చిత్రం, ‘కాటమరాయుడు ’గా కామెడీ (వీడియో)

సప్తగిరి హీరోగా చిత్రం, ‘కాటమరాయుడు ’గా కామెడీ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, డాలి డైరక్షన్ లో రూపొందుతున్న చిత్రం కాటమరాయుడు. ఈ చిత్రం టైటిల్ తో సప్తగిరి హీరోగా ఓ చిత్రం రూపొందుతోందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత పవన్ ఈ సినిమాకు ఈ టైటిల్ కావాల్సి రావటంతో ...పవన్ నిర్మాత శరద్ మరార్ ఈ టైటిల్ ని ఆ నిర్మాతలను సంప్రదించి వారి నుంచి తీసుకున్నారని సమాచారం. దాంతో ఈ సినిమాకు సప్తగిరి ఎక్సెప్రెస్ అని పేరు పెట్టారు. కానీ సినిమాలో మాత్రం సప్తగిరి పాత్రకు కాటమరాయుడు అనే ఉంచారట.

తెలుగు పరిశ్రమలో ఇటీవల కొందరు హాస్య నటులు హీరోలుగా మారుతున్న నేపధ్యంలో మరో కమెడీయన్ ఈ లిస్ట్‌లో జాయిన్ అవుతున్నారు. బ్రహ్మి, సునీల్, అలీ, శ్రీనివాస్ రెడ్డి, సంపూ ఇలా అందరూ తమ కామెడీతో పాటు హీరోయిజాన్ని ప్రదర్శిస్తున్నారు.తాజగా మరో కమెడీయన్ సప్తగిరి కూడా టాలీవుడ్‌లో హీరోగా మారేందుకు రెడీ అయ్యారు. ఆయన హీరోగా ఓ తమిళ రీమేక్ తెరకెక్కుతోంది. ఆ చిత్రం సప్తగిరి ఎక్సప్రెస్ అని పెట్టారు. ఆ చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసారు. ఆ పోస్టర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్‌ పతాకంపై రవి కిరణ్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఆదివారం దర్శకుడు మేర్లపాక గాంధీ విడుదల చేశారు.

 ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'సక్సెస్ లోనూ...

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'సక్సెస్ లోనూ...

దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ...తను డైరక్ట్ చేసిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' విజయంలో సప్తగిరి కూడా ఓ భాగమేనని,. అతను హీరోగా మారడం ఆనందంగా ఉంది''అన్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌'లో సప్తగిరి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సినిమా తర్వాతే అతనికి ఆఫర్స్ బాగా పెరిగాయని చెప్పాలి. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన ఆ చిత్రం ఘన విజయం సాధించి,సందీప్ కు బ్రేక్ ఇచ్చింది. అలాగే రకుల్ ప్రీతి సింగ్ సైతం ఆ సినిమాతోనే వెలుగులోకి వచ్చి దూసుకుపోతోంది.

 తొందరపడలేదు సప్తగిరి

తొందరపడలేదు సప్తగిరి

మారుతి చెబుతూ... ‘‘సప్తగిరిని హీరోగా మారమని చాలామంది చెప్పాం. కానీ తొందర పడలేదు. ఓ మంచి కథ కోసం ఎదురుచూశాడు. తనకు అరుణ్‌లాంటి మంచి దర్శకుడు దొరికాడ''అన్నారు. సప్తగిరికి లైఫ్ ఇచ్చిన డైరక్ట్రర్ ఎవరూ అంటే దర్శకుడు మారుతీనే. ఆయన ప్రతీ చిత్రంలోనూ సప్తగిరికి మంచి పాత్రలు ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మారుతి లేకపోతే సప్తగిరి లేడనే చెప్పాలి.

 స్క్రిప్టు నేనే రాసుకున్నానంటూ సప్తగిరి

స్క్రిప్టు నేనే రాసుకున్నానంటూ సప్తగిరి

సప్తగిరి చెబుతూ ...‘‘తమిళ చిత్రం ‘తిరుడన్‌ పోలీస్‌' నాకు నచ్చింది. ఆ మూలకథని తీసుకొని స్క్రిప్టు నేనే రాసుకొన్నా. ఈ కథకు అరుణ్‌ చక్కటి న్యాయం చేశాడు. ప్రేక్షకుల్ని వందశాతం నవ్వించే చిత్రమిది''అన్నారు. ‘‘సప్తగిరి పంచే నవ్వులే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ'' అన్నారు దర్శక నిర్మాతలు. అలీ, పోసాని, షాయాజీషిండే, అజయ్‌ ఘోష్‌ కీలక పాత్రలు పోషించారు. సంగీతం: బుల్‌గనిన్‌

 ఫుల్ కామెడీనే

ఫుల్ కామెడీనే

గీతాంజలి, లవర్స్, రాజుగారి గది లాంటి చిత్రాలలో తనదైన స్లాంగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన సప్తగిరి ...అరుణ్ పవార్ దర్శకత్వంలో ఈ చిత్రం చేసారు. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పూర్తి కామెడీతో సాగనుంది. ఇక ఈ సినిమా స్క్రిప్టుని సప్తగిరి స్వయంగా రాసారని చెప్తున్నారు.

కామెడీ పోలీస్ కాటమరాయుడు

కామెడీ పోలీస్ కాటమరాయుడు

ఈ చిత్రానికి అన్ని తానై నడిపించాడని చెప్తున్నారు. ఈ సినిమాలో సప్తగిరి కామెడీ పోలీస్ గా కనిపించబోతున్నారు. అలాగే ఈ సినిమాలో సప్తగిరి పాత్ర పేరు కాటమరాయుడు. మరి టాలీవుడ్ నుండి మరో కమెడీయన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న వేళ సప్తగిరిని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూడాలి.

 హిట్ కథ నాకిచ్చాడు

హిట్ కథ నాకిచ్చాడు

దర్శకుడు మాట్లాడుతూ ‘‘మాస్‌ ఆడియెన్స పల్స్‌ బాగా తెలిసిన నటుడు సప్తగిరి. హిట్‌ సినిమా కథను నాకు ఇచ్చాడు. మంచి సినిమాను ప్రేక్షకులకు అందించడం కోసం టీమ్‌ అంతా కృషి చేశాం'' అని అన్నారు.

 నిర్మాత మాట్లాడుతూ...

నిర్మాత మాట్లాడుతూ...

‘‘తమిళంలో హిట్టైన ‘తిరుడన పోలీస్‌' కథను తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ఈ చిత్రం తీశాం. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధంతోపాటు పోలీస్‌ వ్యవస్థ గురించి కొన్ని విషయాలను ఇందులో చూపిస్తున్నాం'' అని నిర్మాత చెప్పారు.

English summary
Saptagiri Express Movie motion Poster is released by Director Maruthi at launch event held in Hyderabad.Comedian Saptagiri is turning as Hero with this film. The film is named after the star comedian itself abd directed by Arun Pawar.Roshini Prakash is female lead opposite to Saptagiri.Watch Saptagiri Express Movie Motion Poster below.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu