»   » రాంచరణ్ సినిమాలో తమిళ హీరో కీలక పాత్ర.. అంతా స్టార్స్ మయం!

రాంచరణ్ సినిమాలో తమిళ హీరో కీలక పాత్ర.. అంతా స్టార్స్ మయం!

Subscribe to Filmibeat Telugu

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. పూర్తిస్థాయిలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బోయపాటి భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. రంగస్థలం వంటి భారీ విజయం తరువాత రాంచరణ్ నుంచి రాబోతున్న చిత్రం కావడంతో మెగా అభిమానులలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్ర కాస్టింగ్ కు సంబంధించి రోజుకొక వార్త బయటకు వస్తూ అభిమానులని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాజగా మరో హీరో ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

భారీ అంచనాలు

భారీ అంచనాలు

రంగస్థలం చిత్రం తరువాత రాంచరణ్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో బోయపాటి చిత్రపై ఆసక్తినెలకొని ఉంది. రోమాలు నిక్కబొడుచుకునే యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ బ్యాంకాక్ లో జరుగుతోంది.

తమిళ హీరో కీలక పాత్ర

తమిళ హీరో కీలక పాత్ర

ఈ చిత్రంలో తమిళ హీరో ప్రశాంత్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జీన్స్ వంటి చిత్రాలతో ప్రశాంత్ గుర్తింపు తెచ్చుకున్నాడు. రాంచరణ్ సినిమాలో నటిస్తుండడంతో అతడిపై పాత్రపై ఆసక్తి నెలకొంది.

విలన్స్‌తో ప్రయోగాలు

విలన్స్‌తో ప్రయోగాలు

బోయపాటి శ్రీను తన చిత్రాల్లో విలన్స్ విషయంలో ప్రయోగాలు చేస్తున్నాడు. లెజెండ్ చిత్రంలో జగపతి బాబుని విలన్ గా నటింపజేసిన బోయపాటి ఆ తరువాత బన్నీ సరైనోడు చిత్రంలో హీరో ఆది పినిశెట్టిని విలన్ గా రంగంలోకి దింపి ప్రయోగం చేశాడు. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. రాంచరణ్ చిత్రంలో ఏకంగా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నే రంగంలోకి దింపాడు. వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

అంతా స్టార్స్ మయం

అంతా స్టార్స్ మయం

బోయపాటి, రాంచరణ్ చిత్రంలో భారీ స్థాయిలో స్టార్ కాస్టింగ్ కనిపిస్తోంది. వివేక్ ఒబెరాయ్, సీనియర్ హీరోయిన్ స్నేహ, ప్రశాంత్ నటిస్తున్నారు. అందాల రాక్షసి ఫేమ్ నవీన్ చంద్ర కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
Tamil hero Prashanth will play key role in Ram Charan movie. Boyapati Srinivas is directing this movie. Kiara Advani is female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X