»   » ఇంకో కొలావరి డీ :మెగా హీరో కోసం ధనుష్ పాట పాడాడు

ఇంకో కొలావరి డీ :మెగా హీరో కోసం ధనుష్ పాట పాడాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమాకు క్రేజ్ తేవాలంటే ఏదో ఒక క్రేజీ కార్యక్రమం చేపట్టాల్సిందే. అందుకోసం దర్శక,నిర్మాతలు ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన 'తిక్క' సినిమాకి అలాగే క్రేజ్ తేవటానికి సంగీత దర్శకుడు తమన్ పూనుకున్నాడు. తమన్ అండతో ఈ సినిమాకు తాజాగా ఓ ప్రత్యేకత వచ్చి చేరింది. అదేమిటంటే...

తమిళ సూపర్ స్టార్ ధనుష్ చేత ఈ సినిమాలో ఓ పాట పాడడం. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో ధనుష్ పాడిన పాట మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని చెప్తున్నారు. ఇప్పటికే ధనుష్-థమన్ కలిసి ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తి చేశారు.

గతంలో తాను హీరోగా నటించిన సినిమాల్లో పాటలు పాడిన ధనుష్, ఇలా ఓ తెలుగు హీరో కోసం ప్రత్యేకంగా పాట పాడడం తొలిసారి. ముఖ్యంగా అప్పట్లో ధనుష్ పాడిన 'కోలవెరి' డి అనే పాట పెద్ద సంచలనమే సృష్టించింది. మరి ఈ పాట ఏ రేంజి సక్సెస్ అవుతుందో చూడాలి.


ఇక 'తిక్క' సినిమా విషయానికి వస్తే ... సాయి ధరమ్‌ తేజ్‌, లరిస్సా బోన్సి, మన్నార్‌ చోప్రా జంటగా చేస్తోన్న సినిమా 'తిక్క'. సునీల్‌ రెడ్డి దర్శకుడు. డాక్టర్‌. సి.రోహిన్‌ రెడ్డి నిర్మాత. శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం లడక్‌లో చివరి పాట చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఇప్పటికే మొదలైన పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఎస్‌.థమన్‌ సంగీతం అందించిన ఆడియోను ఈనెల 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 13న విడుదల చేయడానికి నిర్మాత డాక్టర్‌.సి.రోహిణ్‌ రెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం అభిమానులతో పాటు అందరినీ ఆకట్టుకుంటుందని నిర్మాత డాక్టర్‌.సి.రోహిణ్‌ రెడ్డి అన్నారు. ఈ చిత్రానికి కెమెరా : కె.వి. గుహన్‌, ఎడిటర్‌ : కార్తీక్‌ శ్రీనివాస్‌, ఆర్ట్‌ : కిరణ్‌ కుమార్‌, కథ : షేక్‌ దావూద్‌, మాటలు : హర్షవర్దన్‌, డాన్స్‌ : ప్రేమ్‌ రక్షిత్‌.

English summary
Dhanush now lends his voice for a Telugu movie. He sang a catchy tune composed by S S Thaman for Sai Dharam Tej 'Thikka’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu