»   » తమిళ రాకర్స్ ఆటకట్టు.. గౌరీ శంకర్ అరెస్ట్.. హీరో విశాల్ ఏంత పని చేశాడంటే

తమిళ రాకర్స్ ఆటకట్టు.. గౌరీ శంకర్ అరెస్ట్.. హీరో విశాల్ ఏంత పని చేశాడంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమకు పెను భూతంగా మారుతున్న పైరసిని కట్టడి చేయడానికి అనేక రకాలుగా నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. అయినా పెద్దగా ఒరిగిన దాఖలాలు కనిపించడం లేదు. తాజాగా హీరో విశాల్ కొట్టిన దెబ్బకు తమిళరాకర్స్ అనే వెబ్ సైట్ దిమ్మ తిరిగింది. పైరసి చిత్రాలను అప్ లోడ్ చేస్తున్న ఈ వెబ్ సైట్ ను మూసి వేయిండంలో సఫలమైన విశాల్ ను సిని ప్రముఖులు అభినందిస్తున్నారు. ఇంతకీ విశాల్ చేసినది ఏమంటే...

సినీ ప్రముఖుల హెచ్చరికలతో...

సినీ ప్రముఖుల హెచ్చరికలతో...

దక్షిణాది సిని పరిశ్రమలో రిలీజైన చిత్రాల కాపీలను పైరసీలోకి మార్చి వెబ్ సైట్లలో అప్ లోడ్ చేయడంలో తమిళ రాకర్స్ చాలా పాపులర్. బాలీవుడ్, హాలీవుడ్, సౌత్ చిత్రాలను పైరసీగా మార్చే టోరంట్స్ వెబ్ సైట్ మూతపడిన తర్వాత తమిళ రాకర్స్ పైరసీ వెబ్ సైట్ గా పాపులర్ అయింది. పైరసీని అడ్డుకునేందుకు తమిళ రాకర్స్ సంస్థను పలుమార్లు సినీ ప్రముఖులు హెచ్చరించారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

విశాల్ మూడేళ్ల పోరాటం...

విశాల్ మూడేళ్ల పోరాటం...

భారీ బడ్జెట్ తోపాటు చిన్న చిత్రాలను నిబంధనలకు విరుద్ధంగా పైరసీ చేస్తున్న తమిళ రాకర్స్ నిర్వాహకులపై హీరో విశాల్ గత మూడేళ్లుగా పోరాటం చేస్తున్నారు. పలుమార్లు నిర్వహాకులను హెచ్చరించారు. అంతేకాకుండా తమిళ నిర్మాతల మండలి ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత విశాల్ మాట్లాడుతూ.... తమిళ రాకర్స్ ఆట కట్టించడమే మా ముందున్న ఏకైక లక్ష్యమని అన్నారు.
అందుకు ఓ యువ జట్టు గెలిచిందని పేర్కొన్నారు.

గౌరీ శంకర్ అరెస్ట్...

గౌరీ శంకర్ అరెస్ట్...

సినీ ప్రముఖుల అభ్యర్థన మేరకు స్పందించిన పోలీసులు... తమిళ రాకర్స్ అధినేత గౌరీ శంకర్ ను చెన్నైలో అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ వెనుక విశాల్ విశేష కషి కారణమని ప్రధానంగా కోలీవుడ్ లో వినిపిస్తుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విశాల్ మాట్లాడుతూ... గౌరీ శంకర్ అరెస్ట్ చేయగానే తమిళ రాకర్స్ మూత పడింది. అదే ఈ వెబ్ సైట్ కు చెందిన మరో ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేస్తే పైరసీ భూతాన్ని కూకటి వేళ్లతో పెకలించవచ్చనే ధీమాను వ్యక్తం చేశారు.

ఈ ఏడాది మలయాళంలోకి...

ఈ ఏడాది మలయాళంలోకి...

ప్రస్తుతం విశాల్ తుప్పారివాలన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ ఏడాది మలయాళంలో కూడా రంగ ప్రవేశం చేయనున్నారు. మోహన్ లాల్ నటిస్తున్న విలన్ చిత్రంలో విశాల్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ వైపు నటనను కొనసాగిస్తునే మరో వైపు చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను చాకుచక్యంగా పరిష్కరిస్తున్నారు.

English summary
Tamilrockers, a very popular piracy group, is quite active on the torrents scene, and who uploads Bollywood, Hollywood, Tamil and Malayalam movies. Recently the third admin of the site, Gauri Shankar has been arrested by the Triplicane D-1 Police in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X