twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సంపూ గురించి తప్పుగా మాట్లాడొద్దు, ఏం తప్పు చేశాడని....

    ‘బిగ్ బాస్’ సంపూ ఇష్యూపై తమ్మారెడ్డి స్పందించారు. సంపూపై కొందరు విమర్శలు చేయడాన్ని ఖండించారు.

    By Bojja Kumar
    |

    బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అవకాశం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఇంట్లో ఉండటాన్ని జైలులా ఫీలైన సంపూర్ణేష్ బాబు మెంటల్‌గా డిస్ట్రబ్ అయి తనంతట తానుగా బయటకు వచ్చేశాడు.

    అయితే సంపూ షో నుండి బయటకు రాగానే అతడి కొందరు తిట్టడం మొదలు పెట్టారు. సంపూ వేస్ట్ ఫెల్లో అని, అతడు సినిమా రంగానికి పనికి రాడంటూ ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటిలో పోస్టులు పెట్టారు. బిగ్ బాస్ ఇంట్లో పరిస్థితులకు మానసికంగా కృంగిపోయిన సంపూ బయటకు వచ్చిన తర్వాత తనపై జరిగిన మాటల దాడికి చాలా బాధ పడ్డాడు. ఈ ఇష్యూపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి స్పందించారు.

    అలాంటివి నిజ జీవితంలో జరుగవు

    అలాంటివి నిజ జీవితంలో జరుగవు

    సినిమాల్లో జరిగినవి నిజ జీవితంలో జరుగవని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. బాహుబలిలో ప్రభాస్, రానా యుద్ధం చేశారని బయటకొచ్చి రోడ్ల మీద అందరినీ తంతారా? చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాల్లో వంద మందిని కొడతారు, ఎగిరెగిరి తంతారు... ఇవన్నీ సినిమాల్లోనే తప్ప, నిజ జీవితంలో జరుగవని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.

    మనుషులన్నాక సెంటిమెంట్లు ఉంటాయి

    మనుషులన్నాక సెంటిమెంట్లు ఉంటాయి

    మనుషులు అన్నాక కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. వారి సంతోషాన్ని బాధను, వ్యక్తం చేసుకునే మాధ్యమాలు, మార్గాలు ఉంటాయి. ఒక చిన్న స్థాయి నుండి వచ్చిన సంపూర్ణేష్ బాబు అష్టకష్టాలు పడి సినిమాల్లో పేరు తెచ్చుకుని బిగ్ బాస్ ఎంట్రీ దక్కించుకున్నాడు. కానీ అక్కడ పరిస్థితులకు అడ్జెస్ట్ కాలేక బయటకు వచ్చేశాడని తమ్మారెడ్డి అన్నారు.

    అల్లరి చేయొద్దు

    అల్లరి చేయొద్దు

    సంపూ బయటకు వచ్చిన తర్వాత అతడిని అల్లరి చేయడం సరికాదు. అతడు ఎందుకోసం బయటకు వచ్చాడు. ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చాడు. అతడికి మనం ఎంత సానుభూతి చూపించాలి... అని మాత్రమే ఆలోచించాలి అని తమ్మారెడ్డి అన్నారు.

    24 గంటలు ఎంటర్టెన్మెంట్ చేయడం సాధ్యం కాదు

    24 గంటలు ఎంటర్టెన్మెంట్ చేయడం సాధ్యం కాదు

    మనుషులకు అన్ని సార్లు, అన్ని సందర్భాల్లో ఎంటర్టెన్మెంట్ చేయడం రాదు. సినిమా షూటింగ్ ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తాం. రోజులో ఒక లిమిట్ అనేది ఉంటుంది. కానీ బ్రేక్ లేకుండా పరిచయం లేని 10 మందితో కలిసి 24 గంటలు కెమెరా నిఘాలో ఉండటం కష్టం. అలా ఉండటం కొందరికి జైల్లో ఉన్నట్లు ఉంటుంది. అది తట్టుకోలేక కొందరు మానసికంగా డిస్ట్రబ్ అవుతారు. సంపూ కూడా అలాగే అయ్యాడని తమ్మారెడ్డి తెలిపారు.

    సపోర్టు చేద్దాం, రాళ్లు వేయవద్దు

    సపోర్టు చేద్దాం, రాళ్లు వేయవద్దు

    ఇలాంటి సమయంలో సంపూకు సైకలాజికల్‌గా సపోర్టు చేసే విధంగా ఉండాలి. అంతే కానీ అతడు మరింత బాధపడేలా మన ప్రవర్తన ఉండకూడదు అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు. సంపూ పరిస్థితి గమనించి అతడిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా బయటకు పంపిన మాటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా తమ్మారెడ్డి థాంక్స్ చెప్పారు.

    English summary
    Tollywood Veteran Director Tammareddy Bharadwaj Talks About Telugu #BIGGBOSS Contestants. In This Video Tammreddy Bharadwaj Talks About Sampoornesh Babu and he also gives Clarity on why Sampoornesh Babu Came Out of Bigg Boss. Watch the full video and share your views in the comments section below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X