twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "యాంకర్ ప్రదీప్ అమ్మను బాధ పెట్టారు, పట్టపగలు గజల్ బూతు సీన్లా?"

    By Bojja Kumar
    |

    Recommended Video

    యాంకర్ ప్రదీప్ అలా ? గజల్ ఇలా ? ఏంటీ బూతు సీన్లు ?

    'కొత్త సంవత్సరం కొత్త విషయాలు మాట్లాడుదామని అనుకున్నాను కానీ... కొత్తవి కనిపించడం లేదు. జనం అంతా కలిసి మళ్లీ పాతవార్తలే మాట్లాడుకునేలా చేశారు. కొత్త సంవత్సరంలో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగింది. చెడంటే చెడు కాదు.. చెడు లాంటిది' అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

    కంపు కంపు చేశారుగా...

    ‘నా ఆలోచన' పేరుతో సమాజంలో జరిగే పరిణామాలను విశ్లేషించే తమ్మారెడ్డి తాజాగా గజల్ శ్రీనవాస్ బూతు భాగోతం, ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విషయం గురించి ప్రస్తావించారు. గజల్ శ్రీనివాస్ బూతు భాగోతం, యాంకర్ ప్రదీప్ పైత్యం.... రాత్రి పగలు లేకుండా మీడియాలో చూపించి కంపు కంపు చేశారు అనే అర్థం వచ్చేలా తమ్మారెడ్డి తన అభిప్రాయం వెల్లడించారు.

     ‘ఎ' సర్టిఫికెట్ మించేలా... ఇలా చేయవచ్చా?

    ‘ఎ' సర్టిఫికెట్ మించేలా... ఇలా చేయవచ్చా?

    ‘‘గజల్ శ్రీనివాస్‌ని పట్టుకున్నారు. సంతోషం. తప్పుచేశాడు.. జైలుకి పంపించేశారు.. బాగుంది. కానీ ఆ వీడియోలు మొత్తం టీవీల్లో గానీ, సోషల్ మీడియాలో మళ్లీ మళ్లీ పగలూరాత్రీ అనే తేడా లేకుండా చూపించారు. మామూలుగా ‘ఏ' సర్టిఫికెట్ సినిమాలనే రాత్రి పదకొండు తర్వాత వేయాలని అంటాం. కానీ గజల్ శ్రీనివాస్ xxx వీడియోస్ రాత్రి పగలు అని తేడా లేకుండా చూపించారు. న్యూస్ వేసుకోవచ్చు. కానీ ఇలాంటి వీడియోస్ ప్రసారం చేయవచ్చా? అని తమ్మారెడ్డి ప్రశ్నించారు.

    మీడియాకు చెప్పేంత పెద్ద వాడివి అయిపోయావా? అంటారు

    మీడియాకు చెప్పేంత పెద్ద వాడివి అయిపోయావా? అంటారు

    ఇప్పుడు మనం ఏదన్నా అంటే ..‘మీడియాకు చెప్పేంత పెద్ద వాడివి అయిపోయావా? నువ్వు చెప్పినట్టు మీడియా నడవాలా?' అని అంటారు. నేను చెప్పినట్టుగా మీడియా నడవాల్సిన అవసరం లేదు. డెమోక్రసీలో ఉన్నాం, దాని ఇండిపెండెన్స్ దానికి ఉంది. కానీ, ఎథికల్‌గా మీడియా మీద బాధ్యత ఉంది. ఆ బాధ్యతను విస్మరించవద్దు అని మాత్రమే చెబుతాం. మీడియా ఎలా ప్రవర్తించాలని నేను చెప్పట్లేదు. నా ఆలోచన కూడా అది కాదు.... అని తమ్మారెడ్డి అన్నారు.

    ఆశలేనోళ్లు కొత్తగా ఆశలు పెంచుకునే అవకాశం ఉంది

    ఆశలేనోళ్లు కొత్తగా ఆశలు పెంచుకునే అవకాశం ఉంది

    ఇలాంటి అసాంఘిక చర్యలు జరిగినప్పుడు వాటిని ఎలా అరికట్టాలో చెప్పడం మీడియా బాధ్యత. అంతేతప్పా, ఆ సంఘటనలను అదేపనిగా ఇలా జరిగిందని చూపెట్టడం సబబు కాదు. ఇలా జరిగింది, అలా జరిగింది అని దాన్ని చూపిస్తూ ఉంటే ఆశ లేనోళ్లు, అవకాశం ఉన్నవాళ్లు కొత్తగా ఆశలు పెంచుకునే అవకాశం ఉంది. అటువంటిది ఏమిటో తెలియని వాళ్లు కూడా తెలుసుకునే అవకాశం ఉంది. ఇది పద్దతిగా లేదు అని నా ఫీలింగ్.... అని తమ్మారెడ్డి అన్నారు.

     ప్రదీప్ తాగితే వాళ్ల అమ్మని బాధ పెట్టారు

    ప్రదీప్ తాగితే వాళ్ల అమ్మని బాధ పెట్టారు

    యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. అంతకు ముందు అతడే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని యాడ్ ఇచ్చారు. ఇపుడు అతడు దొరికిపోయాడు, శిక్ష వేస్తారు. పోలీసుల డ్యూటీ పోలీసులు చేస్తారు. అసలు ఆ వీడియో వేసిందే వేసి, అతడి ఇంటి ముందు కెమెరా పెట్టి, వాళ్ల అమ్మను బాధ పెట్టి, ఇంట్లో నుండి బయటకు రానివ్వకుండా చేసి, ఇతడిని ఇంటికి వెళ్లనివ్వకుండా చేసి పోలీస్ స్టేషన్ వద్ద కెమెరాలు పెట్టి రోజూ వస్తాడేమో అని వెయిట్ చేసి... ఎంత మ్యాన్ పవర్ పోతోంది? ప్రదీప్ అనేవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. ఆ రోజు రెండు వేల మంది పట్టుబడ్డారు. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెద్ద ఇష్యూ కాదు. ప్రదీప్ ను హైలెట్ చేసి ఏం చేద్దామని... అంటూ తమ్మారెడ్డి ప్రశ్నించారు.

     కౌన్సిలింగుకు హాజరైన ప్రదీప్

    కౌన్సిలింగుకు హాజరైన ప్రదీప్

    కాగా.... డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిన యాంకర్ ప్రదీప్ సోమవారం పోలీసు కౌన్సిలింగుకు హాజరయ్యారు. బేగంటపేటలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

    ప్రదీప్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిన మీడియా

    ప్రదీప్‌ను ఉక్కిరి బిక్కిరి చేసిన మీడియా

    కౌన్సిలింగుకు హాజరైన ప్రదీప్‌ను మీడియా వారు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది. మీ వల్ల ఒక ప్రాణం పోయి ఉంటే ఏం చేసేవారు? అని ప్రశ్నించడంతో ప్రదీప్ సమాధానం చెప్పలేక పోయారు.

     నా దురదృష్టం అంటూ...

    నా దురదృష్టం అంటూ...

    నా దురదృష్టం కొద్దీ ఆ రోజు అలా తాగి డ్రైవ్ చేయాల్సి వచ్చింది. ఇపుడు నేనేమీ మాట్లాడలేను. ఇలాంటి తప్పు మరొకరు చేయకూడదను అని మాత్రమే చెప్పగలను... అని ప్రదీప్ అన్నారు.

    English summary
    Are celebrities Good Role Models for Teenagers? questions Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He responds on TV Anchor Pradeep Manchiraju's Drunk & Drive Case & Singer Ghazal Srinivas, who was arrested on a charge of harassment levelled against him by a female radio jockey. Do Share your views in the comments section below.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X