Don't Miss!
- News
పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ పిలుపు - కీలక నిర్ణయం..!?
- Sports
వరల్డ్ కప్ ఫైనల్ ముందు అండర్-19 జట్టుకు సర్ప్రైజ్.. మోటివేట్ చేసిన నీరజ్ చోప్రా!
- Finance
pmay: ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? ఇది మీ కోసమే..
- Automobiles
టెన్నిస్ స్టార్ 'సానియా మీర్జా' ఉపయోగించే కార్లు - ఇక్కడ చూడండి
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
చిరంజీవి నెత్తినేసుకుని ఇబ్బంది పడ్డారు, ఫ్యాన్స్ రూ.500 చందా వేసుకుంటే అదిరిపోద్ది : తమ్మారెడ్డి
సంజయ్ కిషోర్ రూపొందించిన ఎస్.వి.రంగారావు ఫొటో బయోగ్రఫి "మహానటుడు" పుస్తక ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హోటల్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. తొలిప్రతిని ప్రముఖ వ్యాపారవేత్త పెండ్యాల హరనాథ్ బాబు ఒక లక్షా వెయ్యినూటపదహార్లు చెల్లించి అందుకున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...చిరంజీవిగారు ఈ కార్యక్రమానికి రావడం, పుస్తకావిష్కరణ చేయడం చాలా గొప్ప విషయం. చిరంజీవిగారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు, ఆయన పరిశ్రమకు చెందిన అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

నెత్తినేసుకుని ఇబ్బంది పడ్డారు
చిరంజీవి గారు కలిసినప్పుడల్లా సర్.. ఇండస్ట్రీ పనులన్నీ మీరే పట్టించుకోవాలి, మీరే చేయాలి అనేవాడిని. ఆయన చేస్తాను అనే వారు. అప్పుడప్పుడు కొన్ని పట్టించుకుంటున్నారు, కొన్ని నెత్తినేసుకుని ఇబ్బందులు కూడా పడ్డారు. ఆ సమయంలో వీడికి పనీ పాటా లేదు నా నెత్తిన వేస్తున్నాడని మనసులో నా గురించి తిట్టుకునే ఉంటారు... అని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

ఫ్యాన్స్ రూ.500 చందా వేసుకుంటే అదిరిపోద్ది
ఈ మధ్య ఓ వ్యక్తి ఉత్తరం రాశారు. హీరోల పుట్టినరోజును ఫ్యాన్స్ పండగలాగా చేసుకుంటారు కదండీ.. వారు లక్షల్లో ఉంటారు. అలా చేసేపుడు తలా ఐదువందలు వేసుకుని ఒక ఊరిని దత్తత తీసుకుని ఏమైనా మంచి పనులు చేస్తే బావుంటుంది. ఊర్లు డెవలప్ అవుతుంటాయి కదా అని రాశారు. చిరంజీవి గారికి ఇదే విషయం చెబితే చాలా బావుంది అన్నారు. నా ఫ్యాన్స్ ఆల్రెడీ రెండు రాష్ట్రాల్లో చెట్లు నాటుతున్నారని తెలిపారని... తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

అభిమానులు తిట్టుకోవడం, కొట్టుకోవడం కాకుండా
ఫ్యాన్స్ ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం కాకుండా ఈ పనులు చేయడం అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మంచి పనులు చేసేలా ఇతర హీరోలకు చిరంజీవిగారు సలహా ఇస్తారని ఆశిస్తున్నాను. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించి అంశాలపై ఫోకస్ పెడుతూ ముందుకు సాగాలని కోరుతున్నాను. చిరంజీవిగారైనా, ఇతర స్టార్స్ అయినా చెబితే ఫ్యాన్స్ వింటున్నారు. వారిని సరైన విధంగా ఉపయోగించాలని కోరుకుంటున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు.

"మహానటుడు" పుస్తక ఆవిష్కరణ
ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, తమ్మారెడ్డి భరద్వాజ, అలి, రావి కొండలరావు, రోజా రమణి, రేలంగి నరసింహరావు, కె.వి.రంగనాథ్, బొలినేని క్రిష్ణయ్య, వడ్డిరాజు రవిచంద్ర, ఎస్వీరంగారావు మేనల్లుడు వెంకట్ తదితరులు పాల్గొన్నారు.