»   » మరీ ఇంత నీచంగానా? అపుడు పవన్ కళ్యాణ్‌ను వాడుకుని...

మరీ ఇంత నీచంగానా? అపుడు పవన్ కళ్యాణ్‌ను వాడుకుని...

Posted By:
Subscribe to Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలను వదిలేసి సీరియస్‌గా రాజకీయాల్లోకి రావడంతో ఇతర పార్టీల రాజకీయ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ఆయన యాత్ర ప్రారంభించగానే ఇష్టమైనట్లు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ వారిని ఏకిపారేశారు.

 అప్పుడు ఆయన వెనకాల తిరిగి

అప్పుడు ఆయన వెనకాల తిరిగి

పవన్ కళ్యాణ్ గారు రాజకీయ యాత్రకు బయల్దేరారు. ఆయన ఏం చేస్తారో? ఏం చెబుతారో? వినడం కూడా ఓపిక లేని జనం ఎక్కువైపోయారు. ఉదయం యాత్రకు బయల్దేరితే సాయంత్రం అయ్యేసరికి నేషనల్ పొలిటికల్ పార్టీల వారు... ఎవరైతే ఈయన వెనకాల తిరిగి, ఆయనతో ప్రచారం చేయించుకున్నారో వారు... ప్రెస్ మీట్ పెట్టి ఆయన భజన పార్టీ అని విమర్శిస్తున్నారు. ఇలా చేయడం తగదు అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

దిల్‌రాజుకు దెబ్బ మీద దెబ్బ.. అప్పుడు స్పైడర్.. ఇప్పుడు అజ్ఞాతవాసి..!
అపుడు భజన పార్టీ అని తెలియదా?

అపుడు భజన పార్టీ అని తెలియదా?

పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు, యాత్రకు బయల్దేరారు, ఎలక్షన్ రాబోతోంది, పోటీ చేస్తానంటున్నాడు, ఆయన పాలసీలు ఇంతవరకు చెప్పలేదు. ఆయన ఏం చేస్తాడో ఇంకా ఎవరికీ తెలియదు. ఈ లోగా ఆయనది భజన పార్టీ అంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. 2014 ఎన్నికలపుడు ఆయనది భజన పార్టీ అని మీకు తెలియలేదా? మీకు సపోర్టు చేసినపుడు భజన పార్టీ అనిపించలేదా? అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

 అపుడు అవసరానికి వాడుకున్నారు

అపుడు అవసరానికి వాడుకున్నారు

ఆ రోజు ఆయన అవసరం ఉంది కాబట్టి ఆయన్ను ఇంటింటికి తీసుకెళ్లారా? మీటింగ్ మీటింగుకు మోడీగారితో సహా ఆయన్ను పట్టుకుని వెళ్లారు కదా? అపుడు తెలియలేదా ఆయన భజన పార్టీ అని? ఎందుకండీ అలాంటి కామెంట్స్ చేస్తారు... అంటూ తమ్మారెడ్డి విమర్శించారు.

ఆయన్ను చూసి భయపడుతున్నారు

ఆయన్ను చూసి భయపడుతున్నారు

పవన్ కళ్యాణ్ గారు ఒక ఫోర్స్(బలం) అనుకుని ఆరోజు తీసుకెళ్లారు. ఈ రోజు ఆయన ఫోర్స్(బలం) చూసి భయపడిపోయి భజనపార్టీ అంటున్నారు. ఆయన భజన పార్టీయో కాదో? అసలు పార్టీయో కాదో? కంటెస్ట్ చేస్తాడో? చేయడో? మళ్లీ మీకే సపోర్టు చేస్తాడో? ఏమో? కాస్త ఆగొచ్చుకదా? ఒక రోజు ఆగలేరా? ఉదయం బయల్దేరితే మధ్యాహ్నానికి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది.... అంటూ తమ్మారెడ్డి మండి పడ్డారు.

మరీ ఇంత నీచంగానా?

మరీ ఇంత నీచంగానా?

మీరంతా నేషనల్ పార్టీలు. ఎందుకు ఇంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఇంత చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం ఏమిటి? ఒక మనిషి గురించి ఇంత చీప్ గా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక వ్యక్తి వచ్చి ఒక పొలిటికల్ పార్టీ పెడతాను అంటున్నాడు. పెట్టనివ్వండి. ప్రజస్వామ్యయుతంగా మంచి చేయడానికి వస్తున్నారు. మీరెట్లాగూ మంచి చేయడం లేదు. కొన్నేళ్ల నుండి మీరు ఏలుతున్నా ఏం మంచి జరిగింది? మీరేమీ చేయట్లేదు. చేస్తాను అని చెప్పి ఆయన వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అని తమ్మారెడ్డి విమర్శించారు.

ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది?

ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది?

ఆయన ఏం చేద్దామనుకుంటున్నాడో ఇంకా చెప్పలేదు. చెప్పేదాకా కూడా వినే ఓపిక లేని మీరు ఇంత అనైతికంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది? కేవలం మీరు న్యూస్ లో కనిపించడం కోసమేనా ఇదంతా? నేషనల్ పార్టీలైన మీరిద్దరూ కూడా ఇలా చేయడంలో ఏమైనా అర్థముందా? దేశాన్ని గురించి ఆలోచించడం మానేశారా? కేవలం ట్రోలింగ్ చేయడం ఎవడిని తిడదామా? ఎలా పేపర్లోకి ఎక్కుదామనే ఆలోచన ఒక్కటే ఉందా? ఎదుటి వారిని కామెంట్ చేసే ముందు మిమ్మల్ని గురించి ఆలోచించుకోరా? అంటూ తనదైన రీతిలో తమ్మారెడ్డి విమర్శించారు.

English summary
Tollywood Veteran Director Tammareddy Bharadwaj Comments on Pawan Kalyan Janasena Party Political Tour and he responds on Pawan Kalyan's JANASENA party entry in 2019 elections in both Telangana and Andhra Pradesh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu