»   » ఇండస్ట్రీలో గ్రూపులు రాజకీయాలున్నాయి: ‘మా’ వివాదంపై తమ్మారెడ్డి

ఇండస్ట్రీలో గ్రూపులు రాజకీయాలున్నాయి: ‘మా’ వివాదంపై తమ్మారెడ్డి

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Tammareddy Bharadwaj Talks About MAA Issue

  'మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్'(మా)లో అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రధాన కార్యదర్శి నరేష్ మధ్య మొదలైన వివాదం మీడియా వరకు వచ్చిన సంగతి తెలిసిందే. 'మా'లో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఈ గొడవ పెద్దగా అయితే ఇండస్ట్రీ పరువుపోతుందనే ఉద్దేశ్యంతో పెద్దలు ఈ గొడవలోకి ఎంటరై కాంప్రమైజ్ చేశారు. మీడియా సమావేశంలో తమ్మారెడ్డి భరద్వాజ, సురేష్ బాబు లాంటి వారు కల్పించుకుని..... ఈ గొడవ ముదిరి మరింత పెద్దగా అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. ఈ అంశంపై తాజాగా తమ్మారెడ్డి భరద్వాజ వివరణ ఇచ్చారు.

  vote for your favourite bigg boss contestant here

   ఇండస్ట్రీ బాగు కోసమే సెట్ చేశాం

  ఇండస్ట్రీ బాగు కోసమే సెట్ చేశాం

  చాలా మంది మీరు ‘మా' గొవడవను వైట్ వాష్ చేస్తున్నారు అన్నారు. అలాంటిదేమీ లేదు. ఇండస్ట్రీకి మంచి జరుగాలంటే, ఇండస్ట్రీ ముందుకెళ్లాలంటే అంతా కలిసుండాలి, గ్రూఫులు అవ్వకూడదు, రాజకీయాలు అవ్వకూడదనే మేమంతా ఆ గొడవను సెట్ చేశామని తమ్మారెడ్డి తెలిపారు.

  ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలున్నాయి

  ఇండస్ట్రీలో గ్రూపు రాజకీయాలున్నాయి

  ఇండస్ట్రీలో రాజకీయాలు ఉంటాయి... ఇక్కడ రాజకీయాలు లేవు, మేముంతా ఒకటే, మేమంతా బంగారం అని నేను చెప్పడం లేదు. ఎంత ఉన్నా కూడా ఇండస్ట్రీ పరువు బజారున పెట్టకూడదు అనేది మా ఉద్దేశ్యం. అపుడే అందరికీ మంచి జరుగుతుంది అనేది మా ఉద్దేశ్యమని తమ్మారెడ్డి అన్నారు.

  వారి పర్సనల్ గొడవలు మాకు అనవసరం

  వారి పర్సనల్ గొడవలు మాకు అనవసరం

  నన్ను చాలా మంది ఈ పంచాయితీలో నువ్వు బకరా అయిపోయావు. ఏదైనా ఇష్యూ జరిగితే నువ్వు చెప్పాలి కదా. లేక పోతే వారైనా చెప్పాలికదా అంటున్నారు. వారికి నేను చెప్పేది ఒకటే. అందరం కలిసి ఉండటమే ఇక్కడ ముఖ్యం. విడిపోవాలి, గొడవలు అవ్వాలని నేనైతే అనుకోను. ఎంత శత్రువులనైనా కలిపేసి ఇండస్ట్రీ బాగు కోసం పాటు పడాలి. వారి పర్సనల్ శత్రుత్వాలు అయితే మనకు అనవసరం. ఇండస్ట్రీకి సంబంధించిన విషయం కాబట్టే నేను కల్పించుకున్నాను... అని తమ్మారెడ్డి అన్నాను.

  అందరికీ కొన్ని రహస్యాలుంటాయి

  అందరికీ కొన్ని రహస్యాలుంటాయి

  ప్రతి ఒక్కరికీ కొన్ని అంతర్గత విషయాలు ఉంటాయి. వాటిని అవసరమైనంతమేర దాచుకుంటాం. ఇండస్ట్రీ విషయంలో కూడా కొన్ని అలాంటివి ఉంటాయి. ఇది కూడా అలాంటి దాపరిమేకమే తప్ప... మిమ్మల్ని మోసం చేద్దామనో, ప్రజలకు ఏమీ చెప్పకూడదనో ఏదీ చేయడం లేదు. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక ఆర్గనైజేషన్ బాగా రన్ అవ్వాలంటే కొన్ని విషయాలు దాచి పెట్టాలి.

  అవసరమైనపుడు ఆ విషయాలు చెబుతాం

  అవసరమైనపుడు ఆ విషయాలు చెబుతాం

  ఆ రోజు ఏం జరిగిందో, వారి మధ్య ఎందుకు విబేధాలు వచ్చాయో అన్నీ మాకు తెలుసు. కానీ అవి చెప్పాల్సిన అవసరం వచ్చినపుడు, చెప్పాల్సిన పరిస్థితి వచ్చినపుడు వందశాతం చెబుతాం. ఇపుడు చెప్పొద్దని అనుకుంటున్నాం. టీవీల్లో నన్ను తిట్టారిని వార్తలు వేశారు. నేను ఇండస్ట్రీ కోసం తిట్లు తినడానికి సిద్ధమే. బకరా అవ్వడానికి సిద్ధమే. నేను ఎవరినీ మోసం చేయడానికో, మసిపూసి మారేడుకాయ చేయడానికో ప్రయత్నం చేయడం లేదు. నేనే కాదు ఇండస్ట్రీలో ఉన్న వారు ఎవరూ చేయం... అని తమ్మారెడ్డి అన్నారు.

  English summary
  Tollywood Veteran Director Tammareddy Bharadwaj reveals about lesser known facts in MAA Association Controversy over the recent US event. He says the issue in Movie Artists Association (MAA) is becoming dirty day by day. Finally, he says Tollywood stars wasted their valuable time and energy with the Dallas event. Now, the MAA team created a chaos which makes no sense. Do share your views in the comments section below.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more