For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముద్దుల్లేవ్, టచ్చింగ్స్ కూడా లేవు, గుండె ఆగిపోతుంది.... 96 మూవీపై తెలుగు దర్శకుడి రివ్యూ!

  |
  Tammareddy Bharadwaj review On 96 Movie | Filmibeat Telugu

  విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో తమిళంలో రూపొందిన '96' మూవీ సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ త్వరలో తెలుగులో కూడా రీమేక్ కాబోతోంది. ఈ నేపథ్యంలో తెలుగు దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఈ మూవీ చూసి చెప్పిన రివ్యూ హాట్ టాపిక్ అయింది.

  ఈ సినిమా చూసిన తర్వాత తాను ఆశ్చర్యపోయానని, అలాంటి సినిమా తీయడానికి వారు ఎలా సాహసం చేశారో అర్థం కావడం లేదు అంటూ విస్మయం వ్యక్తం చేశారు. ఇంతకీ ఈ మూవీ గురించి తమ్మారెడ్డి ఇంకా ఏం చెప్పారో చూద్దాం.

  ముద్దులు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు

  ముద్దులు ఉన్నంత మాత్రాన సినిమాలు ఆడవు

  ఈ మధ్య కాలంలో అర్జున్ రెడ్డి ఒక ఊపు ఊపేసి జనాల్ని కన్‌ఫ్యూజ్ చేసేసింది. ఆ సినిమా గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. ముద్దులు పెట్టారు కాబట్టి ఆడేసిందని కొందరన్నారు. ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 వచ్చింది. అందులోనూ ముద్దులు పెట్టారు కాబట్టి ఆడిందన్నారు. అక్కడి నుంచి ముద్దులు లేకుండా సినిమా తీయడం మానేశారు. ముద్దులు పెట్టే సీన్లు ఉన్న ట్రైలర్ రాగానే జనాలు కొనేయడం, రిలీజ్ చేయడం మొదలు పెట్టారు. అయితే ముద్దులు పెట్టినంత మాత్రాన సినిమాలు ఆడవని ఇటీవల విడుదలైన కొన్ని సినిమాలతో రుజువైందని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.

  అలాంటి వారు ఇండస్ట్రీలో ఎక్కువయ్యారు

  అలాంటి వారు ఇండస్ట్రీలో ఎక్కువయ్యారు

  ఈ మధ్య మనం ముద్దులే ఉండాలి, యాక్షనే ఉండాలి అనే ఆలోచనతోనే సినిమాలు చేస్తున్నాం. అక్కడే పడిపోతున్నాం. ఎవరో ఒకరు కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేయగానే దాంట్లో ఉన్న ఏదో ఒక ఎలిమెంట్ తీసకుని ఆ ఎలిమెంటుతో మనం బ్రతికేద్దామనుకుని దాన్ని కంటిన్యూ చేద్దామనే వాళ్లు ఎక్కువైపోయారని తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.

  96 మూవీ పైరసీ ప్రింట్ చూశాను.. నేను చేసింది తప్పే

  96 మూవీ పైరసీ ప్రింట్ చూశాను.. నేను చేసింది తప్పే

  ఇటీవల 96 సినిమా చూశాను. వాస్తవానికి చూశానని చెప్పకూడదు, యూట్యూబ్‌లో పైరేటెడ్ కాపీ చూశాను. అలా చేయడం తప్పు. నీతులు చెప్పే నేను అసలు చూడకూదను. టీవీలో చూడటానికి లేక సెల్ ఫోన్లో చూశాను. మిడ్ నైట్ 2 గంటలకు కూర్చుంటే ఉదయం 4 గంటల వరకు చూశాను. చాలా ఇంట్రస్టింగ్ అనిపించింది అంటూ తమ్మారెడ్డి తన రివ్యూ మొదలు పెట్టారు.

  హీరో హీరోయిన్ టచ్ కూడా చేసుకోలేదు

  హీరో హీరోయిన్ టచ్ కూడా చేసుకోలేదు


  ఆ సినిమా మొత్తం మీద హీరో హీరోయిన్లు అసలు ముట్టుకోలేదు. ఒక ఒక చోట చిన్న హగ్ ఉంది. అది తప్ప ఒకరినొకరు టచ్ కూడా చేసుకోలేదు. రెండున్నర గంటల సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. విజయ్ సేతుపతి, త్రిష పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది.

  అలాంటి సినమా తీయడం అంటే గుండె ఆగి చనిపోవడమే...

  అలాంటి సినమా తీయడం అంటే గుండె ఆగి చనిపోవడమే...

  అసలు ఆ డైరెక్టర్ కథ ఎలా ఆలోచించాడు? ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమా చేయడానికి ఎలా ధైర్యం చేశాడు? పెద్ద హీరో అయి ఉండి ఎలా ఒప్పుకున్నాడో అర్థం కాలేదు. ముందు ఆ సినిమా తీయడానికి భయమేసి గుండె ఆగి చనిపోవాలి. అటువంటిది ఆ సినిమా తీశారు. ఈ సినిమాను సూపర్ హిట్ చేసిన తమిళ ప్రేక్షకులను అభినందించకుండా ఉండలేం.

  అప్పుడే 30 సినిమాలు దాటేశాడు

  అప్పుడే 30 సినిమాలు దాటేశాడు

  మనం ఇలాంటి కథలు ఎందుకు ఆలోచించడం లేదు. విజయ్ సేతుపతి నాలుగైదేళ్ల క్రితం పిజ్జా సినిమా చేశాడు. అదే అతడి ఫస్ట్ పిక్చర్. ఇప్పటికి అతడి ముప్పై సినిమాలు దాటిపోయాయి. అతడు చేసే సినిమాలు ఒకదానికొకటి సంబంధం ఉండదు. ఆయన్ను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. అతడు ఎన్ని సినిమాలు చేశాడు అనేదానికన్నా సినిమాకు సినిమాకు సంబంధం లేదు. ప్రతి సినిమా డిఫరెంటుగా ఉంది.

  రొమాన్స్ ఉందో? లేదో? కూడా తెలియదు

  రొమాన్స్ ఉందో? లేదో? కూడా తెలియదు


  మన వద్ద కూడా కొత్త రకం సినిమాలు వస్తున్నాయి.... రావడం లేదు అని అనడం లేదు. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు, గీత గోవిందం అలాంటివే. కానీ చాలా తక్కువగా వస్తున్నాయి. తమిళంలో నెలకు దాదాపు రెండు కొత్తతరహా చిత్రాలు వస్తున్నాయి. ముద్దులు, డ్యూయెట్లు, హగ్గింగ్స్, ఫైట్స్ లేకుండా 96 లాంటి ఒక సినిమా హిట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. గీత గోవిందం సినిమాలో కనీసం రొమాన్స్ అయినా ఉంది... కానీ 96లో రొమాన్స్ ఉందా? లేదా? కూడా తెలియదు.

   మీరు పైరసీ చూడొద్దు, తెలుగులో వస్తోంది అప్పుడే చూడండి

  మీరు పైరసీ చూడొద్దు, తెలుగులో వస్తోంది అప్పుడే చూడండి

  నేను పైరసీ చూశాను కాబట్టి మిమ్మల్ని పైరసీ చూడమని చెప్పడం లేదు. తెలుగులో 96 సినిమా త్వరలో తీయబోతున్నారు. అప్పటి వరకు ఆగండి అంటూ... తమ్మారెడ్డి సూచించడం గమనార్హం.

  English summary
  96 Movie: Vijay Sethupathi - Trisha film is a Beautiful & Heart Touching says Tollywood Veteran Director Tammareddy Bharadwaj. He says, #VijaySethupathi and #Trisha shine in exquisite love story and #96 movie is a refreshingly fresh romantic trip down the memory lane with outstanding performances. Finally, he concludes that Trisha Krishnan and Vijay Sethupathi's 96 movie is the most beautiful films out there.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X