»   » పాట ఎందుకు పాడావ్ వివాదం: బస్మాసుర హస్తమే, బాలుకు మద్దతు!

పాట ఎందుకు పాడావ్ వివాదం: బస్మాసుర హస్తమే, బాలుకు మద్దతు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తను కంపోజ్ చేసిన పాటలు పాడటానికి వీల్లేదంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇటీవల పాపులర్ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నోటీసులు పంపడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. నా ఆలోచన పేరుతో సినిమా రంగానికి సంబంధించిన అంశాలపై తన అభిప్రాయాలు చెప్పే తమ్మారెడ్డి 'పాట ఎందుకు పాడావ్?' వివాదంపై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చారు.

అసలు పాట ఎలా పుడుతుంది?

అసలు పాట ఎలా పుడుతుంది?

ఈ వివాదంపై స్పందించే ముందు అసలు పాట ఎలా పుడుతుందనేది చెప్పుకొచ్చారు తమ్మారెడ్డి. సినిమా పాట తయారు కావడానికి నిర్మాత డబ్బు, తనకు కావాల్సిన విధంగా పాటను రాబట్టుకునే దర్శకుడి ప్రతిభ, లిరిసిస్ట్ రచించిన లిరిక్స్, సంగీత దర్శకుడి ట్యూన్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయని.... కేవలం సంగీత దర్శకుడి వల్లనే పాట పుట్టదని చెప్పుకొచ్చారు.

నిర్మాతకు హక్కు లేకుండా పోయింది

నిర్మాతకు హక్కు లేకుండా పోయింది

నిర్మాత డబ్బులిచ్చి అందరితో పని చేయిస్తేనే పాట పుడుతుంది. కానీ ఆ మధ్య వచ్చిన కాపీ రైట్ యాక్ట్ వల్ల నిర్మాతకి ఆల్మోస్ట్ హక్కు లేకుండా పోయింది. కాపీ రైట్ యాక్ట్ రావడానికి ఫారిన్ లో ఉన్న విధానాలే ప్రధాన కారణం. విదేశాల్లో ఎక్కువగా ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్సే ఉంటాయి. అక్కడ సినిమా సంగీతం ఉండదు. కానీ ఇండియాలో మాత్రం ప్రైవేట్ ఆల్బమ్స్ కంటే సినిమా సంగీతమే పాపులర్. విదేశాల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ సింగర్స్, మ్యూజిషియన్సే ప్రొడ్యూస్ చేసుకుంటారు కాబట్టి వారికి హక్కు ఉండాలని కాపీరైట్ యాక్ట్ తెచ్చారు. కానీ ఇండియాలో నిర్మాతే డబ్బులిచ్చి చేయించుకుంటాడు. అందుకే పూర్వకాలంలో నిర్మాతకే హక్కు ఉండేది. కాపీ రైట్ యాక్ట్ వచ్చిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ కి, సింగర్ కి, లిరిక్ రైటర్ కి అందరికీ హక్కులు వచ్చాయి. ఈ యాక్ట్ ప్రకారం ఇళయరాజా బాలసుబ్రహ్మణ్యంకు లీగల్ నోటీసులు పంపారు అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.

సంగీతం పాపులర్ అయితేనే వారికి గుర్తింపు వచ్చేది

సంగీతం పాపులర్ అయితేనే వారికి గుర్తింపు వచ్చేది

ఈ చట్టం తీసుకొచ్చినవాళ్లు ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. అసలు సినిమా సంగీతం పాపులర్ అయితేనే వారికి గుర్తింపు వచ్చేది. ఇళయరాజా గారి పాటలు ఇంకా పాడుతున్నారు కాబట్టే జనం ఆయన్ను ఇంకా గుర్తు పెట్టుకున్నారు. మీ పాటలు పాడటం మానేస్తే మీకు గుర్తింపు లేకుండా పోతుంది మిమ్మల్ని జనం మరిచిపోతారు అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

యాక్ట్ ఈజ్ యాక్ట్

యాక్ట్ ఈజ్ యాక్ట్

యాక్ట్ ఉంది కాబట్టి దాని ప్రకారం నడుచుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఇలా యాక్ట్ పేరుతో పాటలు పాడొద్దు అని అనడం సరైంది కాదు అని నా అభిప్రాయం. ఇప్పటికైనా యాక్ట్ ను లిబరలైజ్ చేస్తే బావుంటుంది. అప్పట్లో ఫిల్మ్ చాంబర్లు కళ్లుమూసుకుపోయాయి కాబట్టే ఈ యాక్ట్ వచ్చింది. ఆ రోజుల్లో చాంబర్స్ అడ్డు పడి ఉంటే ఇది వచ్చేది కాదు అన్నారు.

బస్మాసుర హస్తమే

యాక్ట్ ఉంది, నా పాట పాడొద్దు అంటే బస్మాసుర హస్తం అన్న చందంగా ఉంటుంది. సంగీతం పది మంది పాడుకుంటేనే హిట్టవుతుంది. యాక్టును అడ్డం పెట్టుకుని పాటలు పాడొద్దంటే మనకే నష్టం అని తమ్మారెడ్డి అభిప్రాయ పడ్డారు.

English summary
What went wrong between SPB and Ilayaraja?. Tollywood Veteran Director Tammareddy Bharadwaj Supports Singer SP Balasubramanyam and Opposed music director maestro Ilayaraja for Singing his Songs without his permission. Finally, he hopes it gets positively resolved.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu