»   » ముమ్మాటికీ తప్పే, నాశనం చేస్తున్నారు : తమ్మారెడ్డి ఫైర్

ముమ్మాటికీ తప్పే, నాశనం చేస్తున్నారు : తమ్మారెడ్డి ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో గత కొంత కాలంగా ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. కొందరు బడా నిర్మాతలు ఒక ప్యానల్ గా ఏర్పడి రెండు టీవీ ఛానల్స్ కు మాత్రమే సినిమా యాడ్స్ ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. తాజాగా ఈ వివాదంపై ప్రముఖ తెలుగు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

రెండు ఛానల్స్ కు మాత్రమే యాడ్స్ ఇవ్వాలని షరతు పెట్టడం దారుణం. అలా చేయడం ముమ్మాటికీ తప్పే. కొందర బడా నిర్మాతలు.. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ను నాశనం చేయాలని చూస్తున్నారు. ప్రైవేటు కంపెనీలు పెట్టుకుని వ్యవస్థను దెబ్బతీయడం సరికాదన్నారు.

 Tammareddy Bharadwaja fire on Telugu producers

ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ధరను మాత్రమే నిర్ణయించాలని, ఏ చానెల్‌కు యాడ్‌ ఇవ్వాలో నిర్మాత నిర్ణయించుకుంటారని భరద్వాజ చెప్పారు. అందరినీ కలుపుకుని పోవాలి, అలా కాకుండా తమ తొత్తులగా ఉండే వారికే ప్రయోజనం చేకూరేలా వ్యవహరించడం సరికాదు అంటూ తమ్మారెడ్డి ఫైర్ అయ్యారు.

ఈ వివాదంపై మరికొందరు నిర్మాతలు కూడా స్పందించారు. బండ్ల గణేష్ స్పందిస్తూ.... సిండికేట్ గా ఏర్పడి ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న 14 మంది నిర్మాతల లిస్టులో తాను లేనని స్పష్టం చేసారు. సి కళ్యాణ్ కూడా తాను ఆ నిర్మాతల గ్రూఫులో లేనన్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా ఉన్న ఓ బడా ప్రొడ్యూసర్ కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తున్నట్లు టాక్.

English summary
Tammareddy Bharadwaja fire on all those Producers who formed into a syndicate for providing favour to few channels. He opposed this idea and said their attitude of monopoly is not acceptable,"They are going to give movie ads to just two channels this is a kind of reason less idea, No one is going to be silent here" One of the channel's said to our sources.
Please Wait while comments are loading...