నిర్మాత తమ్మారెడ్డి కృష్ణ మూర్తి మృతి

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని చినపాల ముర్రులో 1920 అక్టోబర్ 4వ తేదీన కృష్ణ మూర్తి సినీ నిర్మాణ సంస్థ 'సారథి'లో మేనేజర్‌గా కెరీర్ ప్రారంభించారు. హైదరాబాద్ లో ఏర్పాటయిన సారథి స్టూడియో తొలి మేనేజర్ కూడా ఆయనే. ఆ సంస్థ నిర్మించే ఎన్నో చిత్రాల్లో పాలు పంచుకున్నారు.
1962లో సొంతగా 'రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్' అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించిన ఆయన బంగారు గాజులు, దత్తపుత్రుడు, లక్షాధికారి, జమిందార్ చిత్రాలను నిర్మిచారు. తెలుగు సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను 2007లో రఘుపతి వెంకయ్య అవార్డు దక్కింది.
స్వాతంత్ర పోరాటంలోనూ కృష్ణ మూర్తి పాలు పంచుకున్నారు. ప్రజా నాట్యమండలి నిర్వహించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవాడు. కృష్ణ మూర్తి తనయుడు ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ. కృష్ణ మూర్తి మృతి విషయం తెలుసుకుని పలువురు ప్రముఖులు దిగ్ర్భాంతికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











