»   » సూపర్ హిట్ కు సీక్వెల్... ట్రైలర్ వచ్చేసింది(వీడియో)

సూపర్ హిట్ కు సీక్వెల్... ట్రైలర్ వచ్చేసింది(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: తాజాగా క్వీన్ సినిమాకు గానూ ఉత్తమనటిగా నేషనల్ అవార్డు గెలుచుకున్న కంగన.. ప్రస్తుతం ఓ సినిమాలో డ్యుయల్ రోల్ లో నటిస్తోంది. నాలుగేళ్ల క్రితం విడుదలై విజయం సాధించిన తను వెడ్స్ మను చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

వీడియో లింక్ 

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తను వెడ్స్ మను రిటర్న్స్ గా తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ చిత్రంలోనూ మాధవనే హీరోగా నటిస్తున్నాడు. ఇక తొలిభాగంలో తనూజ త్రివేదిగా నటించిన కంగన... ఇందులో తనూ పాత్రతో పాటు దత్తో అనే మరో పాత్రలోనూ కనిపించబోతోంది. ఇందులో ఓ పాత్ర గృహిణిగా కన్పిస్తే, మరో పాత్రలో యువతిగా మురిపించనుంది కంగన. ఈ రెండు పాత్రల మధ్య వైవిధ్యం చూపడానికి చాలా కష్టపడాల్సి వస్తోందంటోంది ఈ కర్లీ హెయిర్ బ్యూటీ.

రెండు పాత్రలు ప్రాధాన్యం కల్గిన పాత్రలే అని... ముఖ్యంగా ఈ రెండు పాత్రలు ఒకేసారి కన్పించే సన్నివేశాల్లో నటించడం ఛాలెంజింగ్ గా ఉందంటోంది. ఇక ఇటీవల సాలా ఖదూస్ (Saala Khadoos) చిత్రం కోసం కండలు పెంచిన మాధవన్.. తదుపరి షూటింగ్ జరుపుకుంటున్న తను వెడ్స్ మను రిటర్న్స్ చిత్రంలోనూ కండలతో కనిపించనున్నాడట. మరి.. మరోసారి ఈ జంట కలసి నటిస్తున్న ఈ సీక్వెల్ 'తను వెడ్స్ మను' స్థాయిలో సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.

 Kangana Ranaut

రొటీన్ గ్లామర్ రోల్స్ కంటే.. వైవిధ్యానికి ప్రాధాన్యమిచ్చే పాత్రల్లో కనిపించేందుకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్. అందుకే నటిగా ప్రశంసలతో పాటు రెండు జాతీయ అవార్డులు కూడా ఈ బ్యూటీని వరించాయి.

తను వెడ్స్ మను రిటన్స్ చిత్రం అనుకున్న తేదీ కంటే ఓ వారం ముందే విడుదల అవుతుంది. కంగనా రనౌత్, మాధవన్ జంటగా నటించిన ఈ చిత్రం మే 29న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం వారం ముందుగానే అంటే మే 22న విడదల చేయనున్నట్లు సమాచారం. గడువు కంటే ముందుగానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ టాక్. నాలుగేళ్ళ క్రితం సంచలన విజయం సాధించిన తను వెడ్స్ మను చిత్రానికి ఇది సీక్వెల్.

English summary
Kangana Ranaut in the trailer of Tanu weds Manu 2 will at least brighten up your mood with a generous dose of humour.
Please Wait while comments are loading...