»   » ముచ్చటగా మూడు చాన్స్ లు కొట్టేసిన తాప్సీ...!?

ముచ్చటగా మూడు చాన్స్ లు కొట్టేసిన తాప్సీ...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో రూపొందిన 'ఝుమ్మంది నాదం" చిత్రంలో మనోజ్ సరసన కథానాయికగా తాప్సీ నటించిన సంగతి తెలిసిందే. తాప్సీ నటించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. మంచు మనోజ్ సరసన తను నటించిన మొదటి చిత్రం'ఝమ్మంది నాదం" విడుదలకాకముందే ప్రభాస్-దిల్ రాజ్ చిత్రంలో కాజల్ మొదటి హీరోయిన్ కాగా, తాప్సీని రెండవ హీరోయిన్ ఎంపిక చేశారు. అలాగే విష్ణు సరసన నటించే చాన్స్ కొట్టేసిన ఈ భామ రవితేజ సరసన నటించే చాన్స్ కూడా కొట్టేసింది. రవితేజ హీరోగా రూపొందుతున్న 'వీర" చిత్రంలో ఫస్ట్ హీరోయిన్ అనుష్క నటించనున్న విషయం తెలిసిందే. మరి అదే చిత్రంలో సెకండ్ హీరోయిన్ తాప్సీ ఎంపికైంది. రైడ్ ఫేం రమేష్ వర్మ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu