»   » తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్‌గా చెప్పిన తాప్సీ

తన బాయ్ ఫ్రెండ్ గురించి ఓపెన్‌గా చెప్పిన తాప్సీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చాలా కాలంగా సరైన హిట్ లేని తాప్సీ ఇటీవల విడుదలై ‘గంగ' సినిమా విజయంతో చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఓ పత్రిక ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన పలు విషయాలను బయట పెట్టింది. తన బాయ్ ఫ్రెండ్ గురించిన వివరాలు కూడా బయట పెట్టింది.

త్వరలో సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు తాప్సి చెప్పుకొచ్చింది. కన్నడ సినిమా రీమేక్ చేయాలని ఉంది. నాకు సినిమాలంటే ఇష్టం. నేను సంపాదించింది ఇక్కడే కాబట్టి ఇక్కడే పెట్టుబడి పెడతాను అని తెలిపింది. తెలుగు సరైన పాత్రలు దొరకక పోవడం వల్లనే చేయడం లేదని, తనకు నచ్చిన పాత్ర దొరికితే తప్పకుండా చేస్తానని తాప్సీ చెప్పుకొచ్చింది.

Tapsi revealed her boyfriend details

బాయ్ ఫ్రెండ్ గురించి తాప్సి మాట్లాడుతూ...అతను బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు. మా ఇద్దరికీ ఎప్పుడు ఎక్కడ పరిచయం అని అడక్కండి. దాని గురించి చెప్పడం ఇప్పుడు వీలు కాదు. అతను మాత్రం నా బాయ్‌ ఫ్రెండ్‌! అంతే! అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేద అని తెలిపింది.

ఇక తాప్సీ బాయ్ ఫ్రెండ్ ఎవరని ఆరా తీస్తే...అతను డానిష్ బాడ్మింటన్ ప్లేయ్ మథియాస్ బో అని సమాచారం. ఈ డెన్మార్క్ ఆటగాడు ఆ మధ్య ఓ టోర్నమెంటులో పాల్గొనేందుకు ఇండియా కూడా వచ్చాడు. అయితే ఆ సమయంలో తాప్సీ తన బాలీవుడ్ మూవీ బేబీ ప్రమోషన్లో బిజీగా ఉండటంతో అతనితో ఏకాంతంగా గడపలేక పోయింది.

English summary
Actress Tapsi revealed her boyfriend details. He is none other than Danish badminton player Mathias Boe.
Please Wait while comments are loading...