»   » బ్రెస్ట్ క్యాన్సర్: పింక్‌ అవతారంలో తాప్సీ ఇలా (ఫోటోలు)

బ్రెస్ట్ క్యాన్సర్: పింక్‌ అవతారంలో తాప్సీ ఇలా (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ తాప్సీ సరికొత్త అవతారం ఎత్తింది. 'చెన్నై టర్న్స్ పింక్' అనే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారి పోయింది. పింక్ కలర్ దుస్తులు ధరించి సందడి చేసింది. 'వెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్' అనే స్వచ్ఛంద సంస్థ తరుపున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

మహిళల్లో రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన కల్పించడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రచార కర్తగా తాప్సీని ఎంపిక చేసారు. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ....'రొమ్ము క్యాన్సర్ గురించి ప్రతి ఒక్కరిలోనూ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, ఆరంభంలోనే క్యాన్సర్ లక్షణాలు గుర్తించడం ద్వారా చికిత్స సులభం అవుతుంది. ప్రతి మహిళ ఈ విషయంలో పూర్తి అవగాహన కలిగి ఉండాలి' అన్నారు.

ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో తాను భాగం కావడంత చాలా సంతోషంగా ఉందని, ఈ బాధ్యతను ఒక గౌరవంగా భావిస్తున్నట్లు తాప్సీ తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

క్యాన్సర్ అవగాహన

క్యాన్సర్ అవగాహన

వెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ ఫౌండర్ ఆనంద్ మాట్లాడుతూ...తాను 2003 నుండి ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.

పింక్ వారియర్ ట్రైనింగ్

పింక్ వారియర్ ట్రైనింగ్

వివిధ కాలేజీల నుండి విద్యార్థులను ఎంపిక చేసి.....బ్రెస్ట్ క్యాన్సర్ గురించి ప్రజల్లో ఎలా అవగాహన కల్పించాలనే దానిపై ట్రైనింగ్ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్

ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్

ఎస్ఆర్ఎం ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ ద్వారా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం జరుగుతోంది.

తాప్సీ సినిమాలతో బిజీ

తాప్సీ సినిమాలతో బిజీ

తాప్సీ ప్రస్తుతం వివిధ సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉంటోంది. అయినప్పటికీ ఇలాంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందించదగ్గ విషయం.

తాప్సీ నటిస్తున్న సినిమాలు

తాప్సీ నటిస్తున్న సినిమాలు

తెలుగులో చివరగా ‘సాహసం' చిత్రంలో నటించిన తాప్సీ ప్రస్తుతం వాయ్ రాజా వాయ్, ముని-3 అనే రెండు తమిళ చిత్రాలు, రన్నింగ్ షాది డాట్ కామ్ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.

English summary
Actor Tapsi was named as the new brand ambassador of Chennai Turns Pink, an NGO division of West Cancer Research Foundation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu