»   »  ఆశ్చర్యం :పవన్ 'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో తారక్ (ఫొటో)

ఆశ్చర్యం :పవన్ 'కాటమరాయుడు' సెట్లో నందమూరి హీరో తారక్ (ఫొటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కొన్ని చూడటానికి, వినటానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అలాంటిదే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు సెట్లో నందమూరి హీరో కనపడటం అలాంటి విశేషమే.

పూర్తి వివరాల్లోకి వెళితే....పవన్ కళ్యాణ్, శృతి హాసన్ కాంబినేషన్ లో దర్శకుడు డాలీ రూపొందిస్తున్న మూవీ కాటమరాయుడు. కేవలం ఓ ఫస్ట్ లుక్ తోనే మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు సెట్స్ నుంచి లీక్ అయిన ఓ ఫొటోతో ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ఆ ఫొటోని మీకు అందిస్తున్నాం.

కాటమరాయుడు సెట్స్ లో శివబాలాజీతో కలిసి తారకరత్న లంచ్ చేస్తున్న ఫోటో ఇది. ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నందమూరి హీరోకి.. పవన్ కళ్యాణ్ మూవీకి సంబంధం ఏంటా అనే డౌట్ క్రియేట్ చేస్తోంది.

Tarak ratna in Katama Rayudu Movie Sets

అలాగే కాటమరాయుడు చిత్రంలో తారక్ ఏదన్నా కేరక్టర్ చేస్తున్నాడా అనే ఆసక్తి కలుగుతోంది. ఈ చిత్రంలో పవన్ కు ముగ్గురు తమ్ముళ్లు ఉన్న మాట వాస్తవమే అయినా.. ఆ పాత్రల్లో శివబాలాజీతో పాటు అజయ్.. కమల్ కామరాజు నటిస్తున్న సంగతి తెలిసిందే.

అంటే తమ్ముడు కాదు..అంటే ఏదన్నా విలన్ పాత్ర చేస్తున్నాడా..ఏమో. అయితే కొందరు అనేదేమిటి అంటే... శివబాలాజీ-తారకరత్నలు మంచి ఆఫ్ స్క్రీన్ మంచి స్నేహితులు. అందుకే తన ఫ్రెండ్ ని కలిసేందుకు ఇక్కడకు వచ్చాడు తారకరత్న అంటున్నారు.

మరో ప్రక్క ఈ సినిమా విడుదలకు ముహుర్తం ఫిక్స్ చేసారని చెప్తున్నారు. మార్చి 29వ తేదీని ముహుర్తంగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మార్చి 28 ఉగాది. కొత్త అమావాస్య. ఆ మర్నాడు 29 అంటే బుధవారం కాటమరాయుడు విడుదల. బుధ, గురు, శుక్ర, శని, ఆది అలా అయిదు రోజుల పాటు కాటమరాయుడు దుమ్ము దులపబోతున్నాడన్న అన్నమాట.

English summary
Pawan Kalyan's Katamarayudu latest picture with Siva Balaji along with Nandamuri Tarakaratna at Katamarayudu shooting spot, is leaving people with raised eyebrows.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu