»   » ఇక్కడ కనెక్ట్ అయ్యారు : యంగ్ టైగర్ ఫ్యాన్స్+ పవర్ స్టార్ ఫ్యాన్స్ కలిసి

ఇక్కడ కనెక్ట్ అయ్యారు : యంగ్ టైగర్ ఫ్యాన్స్+ పవర్ స్టార్ ఫ్యాన్స్ కలిసి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎన్టీఆర్‌ నటుడిగానే కాదు సింగర్‌గాను తన టాలెంట్‌ను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో అంతటతో ఆగలేదు...ఇటీవల ఓ కన్నడ చిత్రం లోను ఎన్టీఆర్‌ ఓ పాట పాడగా నిన్న రాత్రి 11.59 నిమిషాలకు ఈ సాంగ్‌ను విడుదల చేసారు.

గెలయా. . గెలయా అంటూ సాగే ఈ పాట శ్రోతలను మరింతగా ఆకట్టుకుంటుంది. అక్కడ ఈ పాట రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇది చూసిన కన్నడ ఆడియన్స్, అక్కడ సూపర్ స్టార్స్ ఈ రెస్పాన్స్ చూసి షాక్ అవుతున్నారు.

గతంలో కొన్ని సినిమాల్లో సాంతంగా పాట పాడిన ఎన్టీఆర్ ... రభస సినిమాలో పాడిన 'రాకాసి రాకాసి' అనే పాట మంచి గుర్తింపు తెచిపెట్టింది. రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలోని 'ఫాలో ఫాలో సాంగ్ అయితే ఒక సెన్సేషన్ . ఇప్పుడు ఎన్టీఆర్ తన సింగింగ్ ట్యాలెంట్ ని ఇలా కన్నడ ప్రేక్షకులకు రుచి చూపించదానికి రెడీ అయ్యాడు.

అయితే ఇంత హ్యూజ్ సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటంటే..ఎన్టీఆర్ పాట అనగానే ఇక్కడ తెలుగులో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ మొత్తం కనెక్ట్ అయ్యారు. అలాగే కన్నడంలో పునీత్ రాజ్ కుమార్ ఫ్యాన్స్ మొత్తం కనెక్ట్ అయ్యారు.టోటల్ గా ఈ పాట పెద్ద హిట్ అయ్యింది.

కన్నడ భాష అయినప్పటికీ....పాట పాడేప్పుడు ఎన్టీఆర్ ఏ మాత్రం ఇబ్బంది పడలేదట. నిజానికి ఎన్టీఆర్‌కు కన్నడ భాషపై కూడా పట్టుంది. ఎందుకంటే ఎన్టీఆర్ తల్లి షాలిని మాతృభాష కన్నడ. అందువల్ల ఆ భాషతో చిన్న తనం నుండే ఎన్టీఆర్‌కి పరిచయం ఉంది. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో కూడా ఎన్టీఆర్ పాట పాడిన సంగతి తెలిసిందే.

మరిన్ని విశేషాలు స్లైడ్ షోలో

ఫ్రెండ్ కోసం..

ఫ్రెండ్ కోసం..

ఈ చిత్ర నిర్మాత ఎన్.కే. లోహిత్ ఎన్టీఆర్ కు మంచి స్నేహితుడు కావడంతో ఆయన రిక్వస్ట్ పై ఎన్టీఆర్ ఈ పాటను పాడినట్టు తెలుస్తుంది.

25 కోసం

25 కోసం

ఎన్టీఆర్ 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో' లో పాడారు. పునీత్ రాజ్ కుమార్ కు కూడా ‘చక్రవ్యూహ' 25వ చిత్రం కావడం విశేషం. తన 25వ చిత్రం స్పెషల్ గా ఉండాలని తన ప్రెండ్ అయిన ఎన్టీఆర్ తో 'చక్రవ్యూహ'లో పాట పాడించాడు పునీత్.

రికార్డ్

రికార్డ్

ఇరవై గంటలలోపులోనే, ఈ పాటను రెండు లక్షలు పైగా చూసారు.

ఛీఫ్ గెస్ట్ గా ...

ఛీఫ్ గెస్ట్ గా ...

ఈ ఆడియో వేడుకకు జూ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నారు. మార్చి 17 న ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఘనంగా చేస్తున్నారు.

గతంలో

గతంలో

రభస, అదుర్స్‌, టెంపర్, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలలో పాటలు పాడిన , జూనియర్‌ ఎన్టీఆర్‌ తాజాగా కన్నడ పాటతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. చక్రవ్యూహ అనే చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్‌ ఈ పాటను పాడగా, థమన్ సంగీతాన్ని అందించారు .

అప్పట్లో...

అప్పట్లో...

అలనాటి అగ్ర నటులు ఎన్టీఆర్‌, కన్నడ కంఠీరవ రాజ్‌ కుమార్‌ల మధ్య మంచి ఫ్రెండ్‌షిప్‌ ఉండేది. వారిద్దరి స్నేహాబంధాన్ని వారి వారసులైన ఎన్టీఆర్‌ మనవడు జూనియర్‌ ఎన్టీఆర్‌, రాజ్‌కుమార్‌ తనయుడు పునీత్‌ రాజ్‌కుమార్‌లు ఇంకా కొనసాగిస్తుండటం విశేషం.

బ్రూస్ లీ విలన్ ...

బ్రూస్ లీ విలన్ ...

శరవణన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లోహిత్ నిర్మాత. తెలుగు మూవీ బ్రూస్ లీలో నటించిన అరుణ్ విజయ్ ఈ చిత్రంలో విలన్ గా చేస్తున్నారు.

ఎన్టీఆర్ ఇలా..

ఎన్టీఆర్ ఇలా..

'యాదృచ్చికంగా మా ఇద్దరివి 25వ చిత్రాలే. రాజ్‌కుమార్‌ చిత్రంలో పాట పాడ్డం సంతోషంగా ఉంది' అని ఎన్టీఆర్‌ సైతం ట్వీట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

స్పెషల్ గా

స్పెషల్ గా

ఈ పాటకు వచ్చిన రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా కొరియోగ్రఫీ, ఎడిటింగ్ చేయిస్తున్నారు

రిలీజ్ ఎప్పుడు

రిలీజ్ ఎప్పుడు


మార్చి 25 ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

 కొత్తగా

కొత్తగా

ఈ సినిమా కథ కొత్తగా ఉంటుందని , యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు

ఆశలు

ఆశలు

రానా విక్రమ్ తర్వాత పునీత్ కు సరైన హిట్ లేదు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు

rn

సాంగ్


ఈ పాటను మీరు ఇక్కడ చూడవచ్చు

ఇక్కడ కనెక్ట్ అయ్యారు : యంగ్ టైగర్ ఫ్యాన్స్+ పవర్ స్టార్ ఫ్యాన్స్ కలిసి

తమన్ ఫుల్ హ్యాపీ...

English summary
Tarak aka Jr NTR has crooned song 'Geleya Geleya' and the audio song (lyric) has gone viral. In fact, it has been considered, one of the best song of Puneeth Rajkumar in the recent past. To keep up the anticipation in the audiences, the film-makers have released the song on March 6, Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu