»   » నేనే సూపర్‌స్టార్ అనుకున్నా, పడిపోయా: బాలయ్య వల్లే మళ్లీ..

నేనే సూపర్‌స్టార్ అనుకున్నా, పడిపోయా: బాలయ్య వల్లే మళ్లీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన వారిల్లో తారకరత్న ఒకరు. నందమూరి హీరోల్లో అందరికంటే గ్రాండ్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా తారకరత్నే. ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి తారకరత్న ఇండస్ట్రీలోకి ఎంటరయ్యాడు. తెరంగ్రేటంలోనే ఇన్ని సినిమాలు చేసిన హీరో ఇండియాలో మరెవరూ లేరనుకుంటా. విచిత్రం ఏమింటే ఇందులో ఒక్కసినిమా కూడా హిట్టు కాలేదు.

ఒక్క హిట్టు కోసం తారకరత్న కెరీర్లో చాలా ప్రయత్నా చేసినా...ఎన్ని సినిమాల్లో నటించినా ఫలతం లేకుండా పోయింది. క్రమ క్రమంలో తారక రత్నకు హీరోగా గుర్తింపు అనేదే లేకుండా పోయింది. సాధారణంగా ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చాక ఎవరూ సినిమా ఇండస్ట్రీలో ఉండటానికి సాహసించరు. ఒక వేళ ఉన్నారు అంటే అందుకు ఎంతో గుండె నిబ్బరం.. ఆత్మవిశ్వాసం ఉండాలి..ఇవి ఉండటం వల్లే తాను ఇంకా ఇండస్ట్రీలో ఉన్నానని అంటున్నారు తారకరత్న.

 Taraka Ratna about his career

వరుస పెయిల్యూర్లతో కుంగిపోయిన తనలో బాబాయి బాలకృష్ణే ఆత్మవిశ్వాసం, గుండె నిబ్బరం పెంపొందేలా చేసారని తారకరత్న తెలిపారు. ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలైనపుడు ఇక నేను సూపర్ స్టార్ అయిపోయినట్లే అనుకున్నా. ఎంతో ఎత్తుకు పోయినట్లే పోయి కింద పడిపోయాను. వరుస ఫెయిల్యూర్లతో కుంగిపోయాను. అప్పుడు బాబాయే నాకు ధైర్యం చెప్పారని తెలిపరారు.

లైఫ్ అనేది రోడ్ జర్నీ లాంటిది. మన ప్రయాణంలో ఒడుదొడుకులాంటాయి. స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. వాటిని చూసి భయపడిపోకూడదు. ప్రయాణం ఆపకూడదు. సినిమాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా ఆగిపోకూడదు. నీకంటూ ఓ రోజు వస్తుంది. కచ్చితంగా నువ్వు నిలబడతావు. ఏదైనా ఇబ్బంది వస్తే నీకు నేనున్నా. ఏం చేయాలన్నా చేస్తా' అని బాబాయి నాకోసారి చెప్పాడు. ఆయనిచ్చిన ప్రోత్సాహంతోనే సినిమాల్లో కొనసాగాను. నాలో ఏదో టాలెంట్ లేకుంటే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండేవాణ్నే కాదు కదా'' అని తారకరత్న అన్నాడు.

హీరోగా కలిసి రాక పోవడంతో ప్రస్తుతం తారకరత్న విలన్ గా తన ప్రయత్నాలు మొదలు పెట్టాడు. తారక రత్న విలన్ గా నటించిన తొలి సినిమా 'రాజా చెయ్యి వేస్తే' ఇటీవల విడుదలైంది. తారకరత్న విలన్ పాత్రకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని, విలన్ పెద్ద హీరోల సినిమాల్లో వరుస అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాడ. ఇప్పటికే తారక రత్న సాయి ధరమ్ తేజ్-గోపీచంద్ మలినేనికాంబినేషన్లో వస్తున్న సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.

English summary
Taraka Ratna about his movie career and Balakrishna support.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu