twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పేరు మార్పుతో తారకరత్న దశ తిరిగేనా...?

    By Sindhu
    |

    ఎన్టీఆర్ (నందమూరి తారకరత్న) హీరోగా అంజి శ్రీను దర్శకత్వంలో కేఎఫ్‌సి అండ్‌ ఎస్‌ఆర్‌బి ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న నందీశ్వరుడు షూటింగ్‌ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని అత్తాపూర్‌ దేవాలయం, శంషాబాద్‌, నానక్‌ రామ్‌ గూడా, సారథి స్టూడియో తదితర లొకేషన్లలో జరిపినట్టు నిర్మాతలు గంగాధర్‌ రెడ్డి, శేగు రమేష్‌ బాబు తెలిపారు.

    ఈ చిత్ర విశేషాల గురించి మాట్లాడుతూ చిత్రం పూర్తయ్యేంతవరకు షెడ్యూల్‌ జరుగుతుంది. ఇంతవరకు జరిగిన షూటింగ్‌తో నలభై శాతం పూర్తయింది. కొంతటాకీ, రెండు ఫైట్స్‌ పూర్తిచేశాం. షీనా నాయికగా నటిస్తోంది అని తెలిపారు.ఇతర పాత్రల్లో సుమన్‌, రాజీవ్‌కనకాల, జీవి, చలపతిరావు, దర్శకుడు శరత్‌ నాగినీడు, ఢిల్లి రాజేశ్వరి, ప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్నారు.

    కన్నడంలో వచ్చిన 'డెడ్లీసోమా" చిత్రానికి ఇది ఆధారం. ఇందులోని ఏడు పాటలను ఏడు దేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్‌ చేశాం. వీటి చిత్రీకరణ నవంబర్‌లో మొదలవుతుంది అని చెప్పారు. ఈ చిత్రం నుండి తారకరత్న తన పేరును తాతగారిలాగా ఎన్టీఆర్‌ అని వచ్చేలా చేసుకున్నారు. సో నందీశ్వరుడు చిత్రం నుంచి ఎన్టీఆర్ గా పేరు నిలబెడితే తారకరత్న అదే ఎన్టీఆర్ కు ఇక ఎదురే ఉండదు. ఇలా పేర్లు మార్చుకుని విజయబాటలోకి వెళ్లిన వారుచాలా మందే ఉన్నారు. పేరు మార్పుతో దశ తిరుగుంతుందనే ఆశతో తారకరత్న ఉన్నారు.

    English summary
    KFC and SRB Art Productions are jointly producing a film titled Nandeeswarudu starring Nandamuri Taraka Ratna (NTR). The film was launched on August 25 at Ramanaidu Studios. Anji Srinu is directing the film produced by Segu Ramesh Babu and Gangadhar Reddy.The film recently completed its shooting in Attapur Temple, Shamshabad Temple, Nanakramguda, Saradhi Studios, MLR Engineering College and Jubilee Hills. The makers are planning to wrap up the film in a single schedule and release the film in December.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X