»   » సొంత ఫ్యామిలీ నుండే బాలయ్యకు విలన్ తయారయ్యాడు!

సొంత ఫ్యామిలీ నుండే బాలయ్యకు విలన్ తయారయ్యాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పటి వరకు నందమూరి హీరోలు కలిసి నటించడం మాత్రమే చూస్తాం. త్వరలో నందమూరి ఫ్యామిలీలోని స్టార్స్ ఒకే సినిమాల ప్రత్యర్థులుగా నటించడాన్ని చూడబోతున్నాం. తాజాగా అందుతున్న బాబాయ్ బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమాలో నందమూరి తారకరత్న విలన్ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య 100వ సినిమా కృష్ణ వంశీ దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. తారక రత్నను సినిమాలో మెయిన్ విలన్ గా చూపిందుకు కృష్ణ వంశీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఆయన ఆలోచనకు బాలయ్య నుండి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం. నారా రోహిత్ కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.

 Taraka Ratna is Balakrishna's villain!

తారక్ బర్త్ డే పార్టీ: ఆప్యాయంగా బాలయ్య ముద్దులు (ఫోటోస్)
ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ కొన్ని రోజులుగా ‘రుద్రాక్ష' పేరుతో హారర్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ చిత్రం జూన్ నెలలో సెట్స్ మీదకు రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి బాలయ్య 100వ సినిమా చేసే అవకాశం రావడంతోకృష్ణ వంశీ తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య చిన్ననాటి జ్ఞాపకాలు... (ఫోటోస్)

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో బాలయ్య రైతుగా కనిపించబోతున్నారట. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది. చాలా కాలం నుండి బాలయ్యతో పని చేయాలని కృష్ణ వంశీ ఎదురు చూస్తున్నారు.

 Taraka Ratna is Balakrishna's villain!

బాలయ్య కోసం చాలా కాలం క్రితమే స్క్రిప్టు కూడా రెడీ చేసి పెట్టుకున్నాడు. గత నెలలో బాలయ్యను కలిసి కథ వినిపించాడు. బాలయ్యకు కథ నచ్చడంతో వెంటనే దాన్నే 100వ సినిమాగా చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే మే నెలలో కృష్ణ వంశీ దర్శకత్వంలో బాలయ్య 100వ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

English summary
Nandamuri Taraka Ratna, nephew of Balakrishna is all set to play a negative role opposite Balayya in the latter’s 100th film. According to a source, director Krishna Vamsi was keen to rope in Tarakaratna for the main villain role, which was later approved by Balakrishna.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu