»   » తారక్ బర్త్ డే పార్టీ: ఆప్యాయంగా బాలయ్య ముద్దులు (ఫోటోస్)

తారక్ బర్త్ డే పార్టీ: ఆప్యాయంగా బాలయ్య ముద్దులు (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి వారసుల్లో ఒకరైన... తారకరత్న పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకల్లో తారకరత్న బాబాయ్, ప్రముఖు నటుడు బాలకృష్ణ, నారా రోహిత్ కూడా పాలు పంచుకోవడంతో బర్త్ డే పార్టీ మరింత జోష్ గా సాగింది. ఈ సందర్భంగా అబ్బాయ్, బాబాయ్ లు అప్యాయంగా ముద్దులు పెట్టుకోవడం అందరినీ ఆకట్టుకుంది.

బర్త్ డే పార్టీని హోస్ట్ చేసింది తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి. అన్ని పనులు ఆమె దగ్గకుండి చూసుకున్నారు. ఈ పార్టీలోకూడా ఆమె సెంటరాఫ్ అట్రాక్షగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, నటి సుమలత తదితరులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు. మరికొందరు సినీ ప్రముఖులు, నందమూరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా పలువురు సెలబ్రిటీలతో బర్త్ డే పార్టీ సందడిగా సాగింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

తారక రత్న ప్రస్తుతం ‘ఎవరు' అనే చిత్రం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...తారకరత్న, పంచీ బోరా, అనూప్‌ తేజ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘ఎవరు'. ముప్పా క్రాంతి చిత్ర పతాకంపై ముప్పా అంకమ్మ చౌదరి నిర్మిస్తున్నారు. రమణ సాళ్వ దర్శకుడు. గురువారం నిర్మాతల మండలి హాలులో జరిగిన కార్యక్రమంలో టీజర్‌ను ఆవిష్కరించారు. ఈ చిత్రంలో తారకరత్న జర్నలిస్టు పాత్రలో కనిపించనున్నారనీ, సస్పెన్స్ మేళవింపుతో ఆద్యంతం చిత్రం ఆసక్తికరంగా నడుస్తుందనీ దర్శకుడు రమణ సాళ్వ చెప్పారు.

తారకరత్న మాట్లాడుతూ ‘‘ఇది విభిన్నమైన స్ర్కిప్టు. ఇప్పటి వరకూ ఈ తరహా కథ రాలేదు. హీరో హీరోయిన్ అని కాకుండా ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. అందరి కెరీర్‌లో ఈ సినిమా ఓ మైలురాయిలా నిలుస్తుంది'' అన్నారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తిచేసి, విడుదలకు సిద్ధం చేస్తున్నామనీ నిర్మాత అంకమ్మ చౌదరి తెలిపారు. సీతారామశాస్త్రి గారు రాసిన పాటలోనే సినిమా కథ ఇమిడి ఉంటుందనీ, తారకరత్న అభినయం ప్రధానాకర్షణ అవుతుందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు యోగేశ్వరశర్మ, నటుడు రఘు కారుమంచి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. నాజర్‌, సుమన్, లాస్య, బీరం మస్తానరావు తారాగణమైన ఈ చిత్రానికి పాటలు: సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, కృష్ణ చిన్ని, సహ నిర్మాత: లింగా శ్రీనివాసరావు, రచన, ఛాయాగ్రహణం, దర్శకత్వం: రమణ సాళ్వ.

తారకరత్న

తారకరత్న

బాబాయ్ బాలయ్యకు ఆప్యాయంగా ముద్దు పెడుతున్న తారకరత్న.

అబ్బాయికి ముద్దు..

అబ్బాయికి ముద్దు..

బాలయ్య కూడా తారకరత్నను అప్యాయంగా ముద్దు పెట్టుకున్నారు.

అలేఖ్య రెడ్డి

అలేఖ్య రెడ్డి

బర్త్ డే పార్టీని హోస్ట్ చేసింది తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి. అన్ని పనులు ఆమె దగ్గకుండి చూసుకున్నారు. ఈ పార్టీలోకూడా ఆమె సెంటరాఫ్ అట్రాక్షగా ఉన్నారు.

రోహిత్

రోహిత్

ఈ బర్త్ డే పార్టీలో నారా రోహిత్ కూడా పాల్గొన్నారు.

కేక్

కేక్

తారకరత్నకు కేక్ తినిపిస్తున్న బాలయ్య.

కేక్ అదిరింది

కేక్ అదిరింది

తారకరత్న కోసం కేక్ ప్రత్యేకంగా తయారు చేయించారు.

పార్టీ జోరుగా

పార్టీ జోరుగా

మరికొందరు సినీ ప్రముఖులు, నందమూరి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇలా పలువురు సెలబ్రిటీలతో బర్త్ డే పార్టీ సందడిగా సాగింది.

సుమలత

సుమలత

తారకరత్న బర్త్ డే పార్టీకి నటి సుమలత కూడా హాజరయ్యారు.

సాయి కొర్రపాటి

సాయి కొర్రపాటి

ఈ బర్త్ డే వేడుకలో నిర్మాత సాయి కొర్రపాటి కూడా పాల్గొన్నారు.

బర్త్ డే

బర్త్ డే

ఫిబ్రవరి 22, 1983లో తారకరత్న జన్మించారు.

English summary
Nandamuri Balakrishna at Taraka Ratna Birthday Celebrations.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu